Sreeleela: రెండు ప్రొఫెషన్ల మధ్య కామన్ పాయింట్ అదే… శ్రీలీల ఏం చెప్పిందంటే?
May 14, 2024 / 12:20 PM IST
|Follow Us
సినిమా ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్లు ఉంటారు అనే విషయం మనకు తెలిసిందే. ఎలా వస్తారు, ఎటు నుండి వస్తారు అనేది తెలియకుండా శుక్రవారం సినిమా రిలీజ్ అవ్వగానే శనివారం ఉదయానికి స్టార్ అయి కూర్చుంటారు. ఇందులో హీరోయిన్లూ ఉంటారు, హీరోలూ ఉంటారు. అయితే హీరోయిన్ల విషయంలో ఈ కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఎంత త్వరగా ఓవర్ నైట్ స్టార్ అవుతారో, తేడా కొడితే ఇబ్బందిపడతారు కూడా. ఇప్పుడు అలాంటి ఇబ్బందుల్లో ఉన్న కథానాయిక శ్రీలీల (Sreeleela) .
అనతి కాలంలో అగ్రహీరోలతో సినిమా ఛాన్స్‌లు అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది శ్రీలీల. అయితే సినిమాల ఎంపిక విషయంలో ఇబ్బందులు వచ్చి కెరీర్లో చిన్న బ్రేక్ తీసుకుంది అని అంటున్నారు. అయితే కొంతమందేమో తన చదువు కోసం బ్రేక్ తీసుకుంది అంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ రాలేదు కానీ.. కెరీర్ విషయంలో ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆమె థాట్ ప్రాసెస్ ఏంటి అనే విషయం ఆమెనే చెప్పింది. ఇప్పడు ఆ విషయాలు వైరల్‌గా మారాయి.
కథానాయిక శ్రీలీల డాక్టర్, యాక్టర్. మామూలుగా అయితే రెండింటిలో ఒకటే అవుతుంటారు మన దగ్గర. కానీ ఆమె రెండూ ఒకేసారి. డాక్టర్ అవ్వాలని మీకే ఆలోచన వచ్చిందా? యాక్టర్ అవ్వాలనీ మీరే అనుకున్నారా? అంటూ ఆమెకు తరచుగా ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. దీనిపై శ్రీలీల క్లారిటీ ఇచ్చేసింది. తన జీవితంలోని రెండు వృత్తుల్నీ తనకు తానుగా ఎంచుకుందట.
ఇంటి వాతావరణం ప్రభావమో లేక పాఠశాల రోజుల్లోనే పెద్దయ్యాక వైద్యురాలిని కావాలనే ఆలోచన రావడమో కానీ.. వైద్య వృత్తి చదువుకోవడంవైపు వచ్చాను. ఇక చిన్నప్పటి నుండి నాట్యంతో ప్రవేశం ఉండటం, వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వడ కారణంగా నటన అంటే ఆసక్తి పెరిగింది. అలా రెండు వృత్తులు ఎంచుకున్నా అని చెప్పింది శ్రీలీల. అయితే ఈ రెండు వృత్తుల ప్రయాణం వేర్వేరుగా కనిపించినా రెండూ ప్రజలతో ముడిపడినవే అనే కామన్ పాయింట్ చెప్పింది.