Sreeleela: ఒక్కో సినిమాకు శ్రీ లీల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • December 27, 2022 / 11:37 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమకు పెళ్లి సందడి సినిమా ద్వారా పరిచయమయ్యారు కన్నడ బ్యూటీ శ్రీ లీల. ఈ సినిమా పెద్దగా ఆదరణ సంపాదించుకోలేకపోయినా శ్రీ లీలా మాత్రం తన నటనతో, అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా పెళ్లి సందడి సినిమా తర్వాత పలువురు దర్శక నిర్మాతలు చూపు శ్రీ లీలపై పడింది. దీంతో అమ్మడికి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీల తాజాగా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ సినిమా మంచి హిట్ అవడంతో అమ్మడి రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిందని సమాచారం. శ్రీ లీల ధమాకా సినిమా కోసం 40 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె బోయపాటి రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో కూడా ఈమె సెకండ్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమాలో కూడా శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీ లీల ఇలా ఇప్పటికే కమిట్ అయిన సినిమాలకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడానికి ఒప్పుకున్నారట. అయితే ప్రస్తుతం తనకు వస్తున్న కొత్త సినిమాలకు మాత్రం ఈమె ఏకంగా ఒక్కో సినిమాకి 1.5 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలిసి నిర్మాతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క సినిమా హిట్ అవడంతో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus