ఇప్పుడున్న లాక్ డౌన్ పరిస్థితుల్లో చాలా మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇక రోజూ వారి కూలి పై ఆధారపడే వారి పరిస్ధితి మరింత ఘోరంగా తయారయ్యింది. నిత్యావసరాలకు కూడా డబ్బులు లేని వారు ఎంతో మంది ఉన్నారు. దీంతో ప్రభుత్వాలు ముందుకు వచ్చి సాయం చేస్తున్నాయి. వారికి మద్దతు ఇస్తూ సినీ సెలబ్రిటీలు సైతం ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. అంతేకాకుండా పేద సినీ కళాకారులను కూడా ఆదుకోవడానికి తెలుగులో సి.సి.సి (కరోనా క్రైసిస్ ఛారిటీ) ని ఏర్పాటు చేసారు మెగాస్టార్.
ఇక తమిళంలో కూడా ఎఫ్.ఈ.ఎఫ్.ఎస్.ఐ(ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) ను ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తున్నారు. అయితే అక్కడ కూడా హీరోయిన్లు తప్ప అందరూ విరాళాలు అందిస్తూ వస్తున్నారు. కొంచెం ట్రోలింగ్ జరిగిన తర్వాత నయనతార వంటి స్టార్ హీరోయిన్లు విరాళం అందించారు. అయితే టాప్ హీరోయిన్ శృతి హాసన్ మాత్రం ఎటువంటి విరాళం అందించలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమెను కొంత మంది ట్రోల్ చెయ్యడం మొదలు పెట్టారు. మరికొంత మంది అభిమానులు విరాళం అందించమని.. ఈ ట్రోలింగ్ మనకి వద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు.
దీని పై శృతీ హాసన్ స్పందించింది. ఆమె తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ…”నాకు సలహాలు ఇస్తున్నవారు కరోనా బాధితులకు ఎంతగా సేవ చేస్తున్నారో తెలుసుకోవాలని వుంది. మనం ఇతరులకు ఎంత సాయం చేస్తే, భగవంతుడు మనకి ఏ లోటు లేకుండా చేస్తాడని నమ్మే వ్యక్తిని నేను. కాబట్టి నేను ఎవరితోనూ చెప్పించుకోవాలని అనుకోవట్లేదు. ఏ సాయమైనా నాకు చెయ్యాలనిపిస్తే .. చేస్తాను. దానికి ఇతరులు సలహాలు నాకు అవసరం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, గతంలో నేను ఎన్నో సార్లు సాయం చేశాను అనేది నిజం అంటూ చెప్పుకొచ్చింది శృతీ హాసన్.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!