Actress Suhasini: చిరంజీవి ఆ రోజు వాళ్ళను గన్ తో బెదిరించారు.. సంచలన నిజాలు బయటపెట్టిన హీరోయిన్ సుహాసిని

  • November 25, 2023 / 12:16 PM IST

గత తరంలో స్టార్ హీరోయిన్‍గా వెలుగొందారు సుహాసిని. చాలా మంది స్టార్ హీరోలతో నటించారు. ఆమె చేసిన చాలా చిత్రాలు అద్భుతమైన విజయాలు సాధించాయి. అందంతో పాటు అభినయంతో సుహాసిని మంచి పేరు సంపాదించారు. ప్రస్తుతం ఆమె సినిమాల్లో సహాయ పాత్రల్లో చేస్తున్నారు. సెలెక్టివ్‍గా చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే, తాజాగా ఈమె చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. కానీ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .

కాగా రీసెంట్ గా ఆయనకు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరోయిన్ సుహాసిని చిరంజీవి జాన్ జిగిడి దోస్తులు చాలా చాలా క్లోజ్ . ఓరోజు సుహాసిని ఇంస్టాగ్రామ్ లో లైవ్ నిర్వహించగా ఆ వీడియో లైవ్ లో ఉండగానే చిరంజీవి వీడియో కాల్ చేశారు . అప్పుడు సుహాసిని (Suhasini) ఆయన గొప్పతనాన్ని వివరించారు .

“కేరళలో అధిరపల్లిలో షూటింగ్ చేస్తున్న టైంలో చిరంజీవి కారు ముందు వెళ్తుంది అని.. వెనక కారులో లేడీ నటులు వస్తున్నామని .. అయితే కొందరు ఆకతాయిలు బీరు బాటిల్ తో .. మా పై దాడికి ప్రయత్నించారు అని అప్పుడు చిరంజీవి తన దగ్గర ఉన్న గన్ తీసుకొని వాళ్లను బెదిరించారు అని “..

“ఆ తర్వాత సినిమా యూనిట్ టీం కూడా అక్కడికి వచ్చి మమ్మల్ని రక్షించారని చెప్పుకొచ్చింది . అంతేకాదు హీరోయిజం అంటే కెమెరా ముందు చేసేది కాదు కెమెరా వెనక కూడా చేసేది . అలాంటి రియల్ హీరో మా చిరంజీవి ” అంటూ గర్వంగా చెప్పుకొచ్చింది. ప్రెసెంట్ ఇదే వీడియో మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus