Sumithra: నటి సుమిత్ర ఇంట్లో ఎంత బంగారం తీసుకెళ్లారో తెలుసా?

  • April 21, 2023 / 01:03 PM IST

హైదరాబాదులో దొంగలు హడలెత్తిస్తున్నారు. చైన్ స్నాచింగ్స్, దొంగతనాలతో రెచ్చిపోతున్నారు. ఒంటరిగా బయటకు రావాలంటేనే మహిళలు భయపడిపోతున్నారు. ముఖంగా బీజీ జీవితాలు గడుపుతున్న రాజకీయ నాయకుల ఇల్లు, అలాగే సినిమా రంగానికి చెందిన వాళ్ల ఇళ్ళను టార్గెట్ చేసి మరి ఉన్నదంతా దోచుకెళ్తున్నారు. తాజాగా శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న టీవీ నటి సుమిత్రా పంపన ఇంట్లో భారీ చోరీ చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను డీఐ దుర్గారావు గురువారం వెల్లడించారు.

శ్రీనగర్ కాలనీలోని క్యాప్రీ టవర్స్ ప్లాట్ నంబరు 501 ఉంటున్న సుమిత్రా (Sumithra) పంపన ఈనెల 17న తాళం వేసి వ్యక్తిగత కారణల వలన ఆమె దిల్లీ వెళ్తూ తాళాలు అదే అపార్ట్మెంట్లోని మరో ప్లాట్లో ఉంటున్నతన సోదరుడు విజయ్ కుమార్ కు ఇచ్చారు. అదే రోజు అర్ధరాత్రి ఫ్లాట్ ప్రధాన ద్వారం గొళ్లెం పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు అల్మారాలో భద్రపరచిన 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 293 గ్రాముల బరువు కలిగిన వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు.

మంగళవారం ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన అదే ప్లాట్ లో ఉంటున్న భువనేశ్వరి అనే మహిళ సుమిత్రా పంపన సోదరుడైన విజయకుమార్ కు సమాచారం ఇచ్చారు. అది తెలుసుకున్న విజయకుమార్ వెంటనే ప్లాట్ దగ్గర వెళ్లి చూసిన వెంటనే దిల్లీలో ఉన్న తన సోదరి అయిన సుమిత్రా పంపనకు సమాచారం ఇచ్చాడు.

బుధవారం నగరానికి చేరుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అపార్ట్మెంట్ సీసీ పుటేజీ పరిశీలించి పోలీసులు ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ మోహన్ కుమార్, ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డీఐ దుర్గారావు తదితరులు పరిశీలించారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus