ఇండోనేసియాలో కలర్స్ స్వాతి లైఫ్ స్టైల్ భలే ఉంది

  • January 2, 2019 / 12:48 PM IST

పెళ్లి చేసుకొని ఇండియా నుంచి వెళ్లిపోయింది కదా కలర్స్ స్వాతి ఇంక మనకేం కనిపిస్తుందిలే అనుకున్నారు ఆమె అభిమానులు, తెలుగు సినిమా ఫ్యాన్స్ కూడా. ఒక లయ, ఒక సంగీత లాగ పెళ్లయ్యాక కనుమరుగైపోతుందనుకున్నారు జనాలు. కానీ.. “నేను ఎక్కడికీ వెళ్లలేదు, ఇక్కడే ఉన్నాను” అంటూ తన ఉనికిని కాపాడుకోవడం కోసం టీవి9 కి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది కలర్స్ స్వాతి అలియాస్ స్వాతిరెడ్డి. రెగ్యులర్ ఇంటర్వ్యూ ఫార్మాట్ లో ఏదో ఒక చోట కూర్చుని లేదా నడుస్తూ ఇంటర్వ్యూ ఇవ్వడం కాకుండా.. తాను ఇండోనేసియాలోని తన కొత్త ఇంట్లో రోజూ ఎలా ఉంటుందో అదే తరహాలో ఇంటర్వ్యూ ఇచ్చింది.

అసలు స్వాతి ఇప్పటివరకూ నటించిన ఏ ఒక్క సినిమాలోనూ బికినీ కాదు కదా కనీసం గ్లామర్ డ్రెస్ లో కూడా కనిపించలేదు. అలాంటిది ఈ ఇంటర్వ్యూలో అమ్మడు ఏకంగా టూ పీస్ బికినీలో దర్శనమిచ్చేసరికి ఆమె ఫ్యాన్స్ అందరూ షాకయ్యారు. మరి సినిమాల్లో నటించడానికి నేను రెడీ అని చెప్పడానికి ఇలాంటి ప్రదర్శనలు చేస్తోందా లేక మనకు తెలియని స్వాతి రియల్ లైఫ్ యాంగిల్ ఇదేనా అని అందరూ నోరెళ్ళబెడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే.. జనాలు మాత్రం స్వాతి స్విమ్మింగ్ పూల్ వీడియోను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus