Taapsee: స్టార్ హీరోయిన్స్ పై సంచలన కామెంట్స్ చేసిన తాప్సీ!
July 18, 2023 / 06:33 PM IST
|Follow Us
తాప్సీ టాలీవుడ్ లోకి ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక మరింత బోల్డ్ గా మారిపోయింది. పలు ఇంటర్వ్యూలలో తాప్సి బోల్డ్ గా మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. తాప్సి నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంచుకుంటూనే..
వీలు చిక్కినప్పుడల్లా గ్లామర్ తో అదరగొడుతోంది. తరచుగా తాప్సి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. అయితే తాప్సి సమాధానం ఎప్పుడూ నేరుగా ఉండదు. ఏదో ఒక వివాదం రగిలేలా తాప్సి తరచుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. ఇటీవల తాప్సి ఆన్లైన్ లో ఫ్యాన్స్ తో చాట్ సెషన్ నిర్వహించింది. ఇక నెటిజన్లు ఊరుకుంటారా ? హీరోయిన్ ఆన్లైన్ లోకి వస్తే పెళ్లి ఎప్పుడు అంటూ గోల చేస్తారు. తాప్సిని కూడా పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు తాప్సి ఊహించని విధంగా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.
‘నేనింకా గర్భవతిని కాలేదు.. కాబట్టి నా పెళ్లి అంత తొందరగా ఉండకపోవచ్చు’ అంటూ ఊహించని కామెంట్స్ చేసింది. పెళ్లి గురించి అడిగితే పెళ్ళికి ముందే గర్భం గురించి ఎందుకు వివాదం రేపింది అంటూ చర్చ జరుగుతోంది. అయితే కొందరు బాలీవుడ్ హీరోయిన్లకు కౌంటర్ గానే తాప్సి ఈ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు. ఇలియానా, అలియా భట్, నేహా ధూపియా లాంటి వారంతా పెళ్ళికి ముందే గర్భం దాల్చారు. దీనితో అలియా భట్ రణబీర్ ని.. నేహా ధూపియా అంగద్ బేడీని వెంటనే వివాహం చేసుకున్నారు.
అయితే ఇలియానా మ్యారేజ్ విషయంలో ఆమె ఇంకా ఓపెన్ కాలేదు. ఇప్పడు పెళ్ళికి ముందే గర్భం.. అది తెలియగానే వెంటనే పెళ్లి అనే ట్రెండ్ ఉందని తాప్సి సదరు హీరోయిన్లకు కౌంటర్ ఇచ్చినట్లయింది. తాప్సి కూడా గత కొన్నేళ్లుగా బ్యాట్మింటన్ ఆటగాడు మ్యాతీస్ బోతో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ పలు సందర్భాల్లో జంటగా కనిపించారు. తాప్సి వయసు ప్రస్తుతం 35 ఏళ్ళు. కానీ సొట్టబుగ్గల సుందరి ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ప్రస్తుతం తాప్సి (Taapsee).. షారుఖ్ ఖాన్ డుంకి చిత్రంలో నటిస్తోంది.