సంచలనం సృష్టిస్తున్న టబు బోల్డ్ కామెంట్స్..!

  • January 30, 2021 / 10:00 AM IST

గ్లామర్ కు సరికొత్త డెఫినిషన్ చెప్పడంలో ఎప్పుడూ ముందుంటుంది టబు. 40 ఏళ్ళ వయసు దాటినా పెళ్లి చేసుకోని ఈ సీనియర్ హీరోయిన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా.. శృంగారపు సన్నివేశాల్లో నటించి ఇప్పటికీ కుర్ర కారుకి వేడి పుట్టిస్తుంది. అంతేకాదు మనిషికి శృంగారం కూడా అవసరమే అంటూ ఘాటు కామెంట్లు కూడా చేస్తుంది టబు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు.. ఇలాంటి బోల్డ్ కామెంట్స్ ఎన్నో చేసి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

ఆమె మాట్లాడుతూ… ” మోరల్ గా చెప్పాలంటే.. మంచి పాత్రలు, అన్ని విధాలా పాజిటివ్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం.అలాగే మనిషికి శృంగారం అవసరం.స్ట్రీలలో కూడా కామం అనేది ఉండడం సహజం. అదేదో పెద్ద తప్పు అన్నట్టు కొంతమంది మాట్లాడతారు అది కరెక్ట్ కాదు. కానీ, అదే సమయంలో నెగిటివ్ క్యారెక్టర్స్, స్త్రీ కోరికలకు చెందిన భావోద్వేగాలు, అధికారం పట్ల స్త్రీలలో వ్యామోహం… ఇలాంటివన్నీ నాకు అలాగే ప్రేక్షకులకు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.

అందుకే రొటీన్‌కి భిన్నమైన అలాంటి పాత్రల్ని చెయ్యడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను” అంటూ చెప్పుకొచ్చింది టబు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో తల్లి పాత్ర పోషించిన టబు.. ఇప్పుడు ఎక్కువగా హిందీ సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లలోనే నటిస్తుంది. ‘ఏ సూటబుల్ బాయ్’ బీబీస్ టీవీ సిరీస్‌లో ఈమె చేసిన శృంగారపు సన్నివేశాలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. మీరా నాయర్ దర్శకత్వం వహించిన ‘ఏ సూటబుల్ బాయ్’ లో ఈమె వేశ్య పాత్ర పోషించింది. భవిష్యత్తులో కూడా అలాంటి ఛాలెంజింగ్, సె*స్, ఇంటెన్స్ క్యారెక్టర్స్ ఉన్న పాత్రలకే పెద్ద పీట వేస్తానని టబు చెబుతుంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus