Tejaswi Madivada: తన పెళ్లి మేటర్ పై స్పందించి.. షాకింగ్ విషయాలు తెలిపిన తేజస్వి మదివాడ..!
August 16, 2022 / 04:08 PM IST
|Follow Us
వెంకటేష్- మహేష్ బాబు లు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో నటిగా మారింది తేజస్వి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ తెలుగమ్మాయి అనంతరం పలు సినిమాల్లో నటించి మెప్పించింది.ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్ క్రీమ్’ చిత్రంలో విచ్చల విడిగా అందాలు ఆరబోసి బాగా పాపులర్ అయ్యింది. అటు తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 2’ లో కంటెస్టెంట్ గా పాల్గొని విమర్శల పాలైంది.
హౌస్ లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్ కౌశల్ పై నోరు పారేసుకుని.. ట్రోలింగ్ కు గురయ్యేది. అటు తర్వాత ఈమె సినిమాల్లో పెద్దగా కనిపించింది లేదు. త్వరలో ఆమె ‘కమిట్మెంట్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 19న ఈ మూవీ విడుదల కాబోతుంది.ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం వల్ల సెన్సార్ ఇష్యూస్ ఎదుర్కొంటుంది అని తాజాగా సమాచారం. మొత్తానికి వాటిని అధిగమించి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీ.
ఈ చిత్రం ప్రమోషన్లలో తేజస్వి పాల్గొని తన పెళ్లి టాపిక్ పై స్పందించింది. “కంటెంట్ డిమాండ్ చేస్తే ఎలాంటి బోల్డ్, కిస్ సన్నివేశాల్లో అయినా నటించడానికి సిద్ధం అంటూ చెప్పుకొచ్చిన తేజస్వి… ‘ ‘కమిట్మెంట్’ సినిమాల్లో బోల్డ్ సన్నివేశాల్లో నటించడం నేను ఇబ్బంది పడలేదు అని శ్రీనాథ్ ఇబ్బంది పడ్డాడు అని ఆమె చెప్పుకొచ్చింది.
‘నిజ జీవితంలో నన్ను ఎవరు కమిట్మెంట్ అడగలేదని అలా అడగాలన్నా కూడా భయపడేవారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.’సినిమాలు మానేసి పెళ్లి చేసుకోమని మా ఇంట్లో వాళ్ళు చెబుతున్నారు. అందుకే పెళ్లి చేసుకోవడం మానేశాను’ అంటూ తన పెళ్లి గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది తేజస్వి మదివాడ.