Varalaxmi Sarathkumar Wedding: ఘనంగా వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు.!
July 12, 2024 / 12:15 PM IST
|Follow Us
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) వివాహం… ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నికోలై సచ్దేవ్ తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. మార్చి 1న వీరి ఎంగేజ్మెంట్ ముంబైలోని ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.14 ఏళ్లుగా ఉన్న వీరి పరిచయం కాస్త స్నేహంగా, ఫ్రెండ్షిప్ గా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్ళికి రెడీ అయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే…
నికోలై సచ్దేవ్ ని విమర్శిస్తూ కొంతమంది నెగిటివ్ కామెంట్లు కూడా చేశారు. అయితే వరలక్ష్మి వాటన్నిటినీ పట్టించుకోను అని ‘శబరి’ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె వెడ్డింగ్ కార్డ్స్ ని బాలకృష్ణ(Balakrishna) ,అల్లు అర్జున్ (Allu Arjun) ,అల్లు అరవింద్ (Allu Aravidh) వంటి టాలీవుడ్ స్టార్స్ కి ఇచ్చి ఆహ్వానించిన ఫోటోలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చెన్నైలో జూలై 3న ఆమె వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
ఇక నిన్న నికోలై సచ్దేవ్ తో వరలక్ష్మీ వివాహం.. బ్యాంకాక్ లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు వీరి పెళ్లి వేడుకకు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి. ప్రస్తుతం అవి వైరల్ గా మారడంతో నూతనవధూవరలకు నెటిజన్లు కూడా తమ బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు.