Vijayashanti: కొడుకు గురించి తొలిసారి స్పందించిన విజయ శాంతి ఏం చెప్పారంటే..?
April 1, 2023 / 08:05 PM IST
|Follow Us
సామాజిక మాధ్యమాలు, పలు వెబ్ సైట్ల ద్వారా ఒకప్పటి నటీనటుల గురించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. అలాగే తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వస్తున్న వార్తల గురించి కూడా క్లారిటీ ఇస్తూ వాస్తవాలు తెలియజేస్తున్నారు సీనియర్ యాక్టర్స్.. ఇప్పుడు విజయ శాంతి చాలా కాలంగా వినిపిస్తున్న ఓ విషయం గురించి మాట్లాడారు.. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ‘లేడీ సూపర్ స్టార్’, ‘లేడీ అమితాబ్’ గా చిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు..
హీరోలకు సమానంగా ఇమేజ్ సంపాదించి.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు..తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో నటించిన పాన్ ఇండియా స్టార్ ఆమె.. దాదాపు ఈ భాషలన్నిటిలోనూ స్టార్ హీరోలతో పని చేశారు.. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోనూ దూసుకెళ్లారు.. 1966 జూన్ 24న జన్మించిన విజయ శాంతి తన 22వ ఏట M.V. శ్రీనివాస్‌ను వివాహం చేసుకున్నారు..
కొద్ది కాలంగా ఆమెకు ఓ కొడుకున్నాడనే వార్త ప్రచారంలో ఉంది.. ఇతనే ఆమె కొడుకు అంటూ ఓ ఫోటోను కూడా వైరల్ చేశారు.. వాస్తవమేంటంటే తనకు పిల్లలు లేరు.. పెళ్లి తర్వాత ఆమె పిల్లల్ని కనొద్దని డిసైడ్ అయ్యారు.. దానికి కారణం ప్రజాసేవ.. పిల్లలు ఉంటే తాను ప్రజాసేవ చేయలేనేమో అనే భయంతోనే ఆమె పిల్లల్ని కనొద్దని నిర్ణయించుకున్నారు.. తాజాగా ఆమెకు కొడుకు ఉన్నాడనే విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు..
‘‘నాకు (Vijayashanti) అసలు పిల్లలే లేరు.. ఈ విషయం దాదాపుగా అందరికీ తెలుసు.. అలాంటిది నాకు పాతికేళ్ల కొడుకు ఉన్నాడని చెప్పడం నిజంగా తెలివి లేని వారు చేసే పని.. నేను ఇప్పుడు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నాను.. మంచి పాత్రలు వస్తే సినిమాల్లో నటించేందుకు కూడా సిద్దంగా ఉన్నాను’’ అంటూ క్లారిటీ ఇచ్చారు విజయ శాంతి.. చాలా కాలం తర్వాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు..