త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో కనిపించిన విభిన్నమైన కథానాయికలు
November 6, 2019 / 03:54 PM IST
|Follow Us
నేను రాసే కథ అందరికీ గుర్తుండాలని ప్రతి రచయిత అనుకుంటాడు. అందుకే తన కథలో కథానాయకుడికి మంచి ప్రతిభని జోడిస్తాడు. ప్రతి కథానాయకుడిని కూడా మరింత ప్రతిభావంతుడిగా చూపిస్తాడు. మరి కథానాయిక.. ఈమె విషయంలో చాలా మంది లైట్ తీసుకుంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం తన కథలో కథానాయికని విభిన్నంగా మలుస్తారు. అలా మాటల మాంత్రికుడు సృష్టించిన కథానాయికలపై ఫోకస్…
1. అను ఇమ్మానుయేల్ (అజ్ఞాతవాసి) కొంతమందికి ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటారు. తన ఇంట్లో వస్తువులే కాదు.. ఎక్కడైనా చిందరవందరగా ఉంటే నచ్చదు. అటువంటి మనస్తత్వం కలిగిన అమ్మాయిగా అజ్ఞాతవాసిలో హీరోయిన్ ని చూపించారు. ఇందులో అను ప్రతి దాన్ని స్ట్రైట్ గా ఉంచుతుంది.
2. సమంత (అ.. ఆ )అ.. ఆ సినిమాలో సమంత చేసిన క్యారక్టర్ ప్రతి విషయాన్నీ సీరియస్ గా తీసుకొని ఒత్తిడిగా ఫీలవుతుంది. అందుకే డాక్టర్ ఆమెకు ఒక స్ట్రెస్ బాల్ ని సూచిస్తాడు. ఆ బాల్ తోనే సినిమా మొత్తం కనిపిస్తుంది.
3. సమంత ( సన్ఆఫ్ సత్యమూర్తి )సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో హీరోయిన్ కి డయాబెటిస్ ఉందని చూపించారు. ఈ సమస్యతో సెంటిమెంట్ జోలికి ఏళ్లకండా డయాబెటిస్ ఉన్నవారు కొన్ని సార్లు ఎలా ఫీలవుతారో.. అనేదాన్ని కామెడీగా మలిచారు.
4. ఇలియానా (జులాయి )సన్నగా, సోడాబుడ్డి కళ్లద్దాలు, పంటికి క్లిప్పులు .. పెట్టుకుని ఇలియానా జులాయి సినిమాలో కనిపిస్తుంది. ఆర్ట్ ఫిలిం లో కూడా హీరోయిన్ ఇలా ఉండదు. కానీ ఇంట్రెవెల్ తర్వాత హీరోయిన్ ని స్టైల్ గా చూపించారు.
5. అనుష్క (ఖలేజా )సినిమాలో ఏదొక క్యారెక్టర్ ఐరెన్ లగ్ అని పేరు పెట్టి కామెడీ సృష్టిస్తుంటారు. కానీ ఖలేజాలో హీరోయిన్ ని ఐరెన్ లగ్ గా చూపించి.. నవ్వులు పూయించారు.
6. త్రిష (అతడు)నా కంటే అందగత్తె ఈ లోకంలో ఎవరు లేరు.. అనేది దాదాపు అమ్మాయిలందరిలో ఉండే భావన. ఈ విషయాన్నీ లోపలే దాచుకోకుండా బయటికి చూపిస్తే.. అదే అతడు సినిమాలోని పూరి పాత్ర. ఈ రోల్ ని త్రిష బాగా చేసి నవ్వించింది.
7. శ్రియ (నువ్వే నువ్వే )కొంతమంది అమ్మాయిలు చాలా అమాయకంగా ఉంటారు. ఆ అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా అనిపించే రోల్ ని త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాలో సృష్టించారు. ఇందులో శ్రియ ని చూస్తే అమ్మాయిలు ఇంత అమాయకంగా ఉంటారా? అనిపిస్తుంది.
త్రివిక్రమ్ తన సినిమాల్లో హీరోయిన్స్ కి దిష్టి తగులుతుందననేమో ఇలా చాలా అందమైన అమ్మాయిలకు ఇలాంటి చిన్న లోపాలు పెట్టారు. ఆ లోపాలతో సరదాగా నవ్వుకునేలా చేశారు.