హీరోయిన్ యాషిక ఆనంద్ కారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తమిళనాడులో ఈ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. వీకెండ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె తన స్నేహితులతో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్ళింది. అయితే అనుకోకుండా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. యాషిక స్నేహితురాలైన పావని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న యాషిక.. తన స్నేహితురాలి మృతి పట్ల స్పందించి చాలా ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
యాషిక మాట్లాడుతూ… ‘ఇప్పుడు అనుభవిస్తున్న బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నేనింకా ప్రాణాలతో ఉన్నందుకు చాలా బాధగాను సిగ్గుగానూ ఉంది. యాక్సిడెంట్ నుండీ నేను ప్రాణాలతో బయటపడినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలో లేక నా ప్రాణ స్నేహితురాలిని కోల్పోయినందుకు ఆయన్ని దోషిగా చేసి నిందించాలో నాకు అర్థం కావడం లేదు. పావని.. ప్రతి క్షణం నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను. నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని నాకు తెలుసు!!
నన్ను శిక్షించడానికైనా నువ్వుంటే బాగుండేది. నీ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టినందుకు నన్ను క్షమించు!! నువ్వు మళ్లీ మా మధ్యకు రావాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నాను. బుధవారం (ఆగస్టు 4) నా పుట్టినరోజుని దయచేసి ఎవరూ సెలబ్రేట్ చేయొద్దు అలాగే నాకు విషెస్ కూడా చెప్పొద్దు’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!