Dance Icon: మోనాల్ గజ్జర్, శ్రీముఖి, యష్ మాస్టర్ స్పెషల్ అట్రాక్షన్ అవుతారట..!

  • August 23, 2022 / 09:46 PM IST

‘ఆహా’.. ప్రారంభించిన రెండేళ్లలోనే లీడింగ్ ఓటీటీ సంస్థగా అగ్ర పీఠాన్ని అధిష్టించింది. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో విభిన్న పద్ధతులు ఫాలో అవుతుంది ‘ఆహా’. పలు సినిమాలను, వెబ్ సిరీస్ లను నేరుగా నిర్మించి… విడుదల చేయడం,… వీకెండ్లో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ చేయడం లేదా ఆల్రెడీ థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలను స్ట్రీమింగ్ చేయడం వంటివి చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ‘ఆహా’. ‘సామ్ జామ్’ ‘అన్ స్టాపబుల్’ వంటి టాక్ షోలతో ఇండియా వైడ్ టాప్ రేటింగ్ ను సంపాదించుకుంది ఆహా.

తర్వాత ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి తమ ప్రత్యేకతని చాటుకుంది. ఈ షోకి మెగాస్టార్, బాలకృష్ణ వంటి స్టార్లని తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిపింది. ఇక మాట.. పాట అయిపోయింది కాబట్టి ఆటకి కూడా రంగం సిద్ధమైందని చెప్పాలి. అదేనండీ డాన్స్. ‘డాన్స్ ఐకాన్’ అనే పేరుతో ఓ డాన్స్ షోని ప్రారంభిస్తున్నట్టు ఇది వరకే ప్రకటించింది ఆహా. ఈ షోని ఓంకార్ హోస్ట్ చేయనున్నారు.

ఇక డాన్స్ ఐకాన్ విన్నర్ గా నిలిచిన కంటెస్టెంట్ కు ట్రోఫీ తో పాటు క్యాష్ ప్రైజ్ ఉంటుందట.. అంతేకాకుండా టాలీవుడ్లో ఓ టాప్ హీరోకి కొరియోగ్రఫీ చేసే అవకాశం కూడా లభిస్తుందని ఓంకార్ చెప్పుకొచ్చాడు. అది ఏ హీరోకి అనే విషయాన్ని అల్లు అరవింద్ గారు ఫినాలే ఎపిసోడ్ లో అనౌన్స్ చేస్తారు అని ఓంకార్ తెలిపాడు. ఇదిలా ఉండగా.. ఈ షోకి అదనపు హంగులు కూడా జోడిస్తున్నట్టు తాజా సమాచారం.

బిగ్ బాస్ కంటెస్టెంట్ లు గ్లామర్ క్వీన్లు అయిన శ్రీముఖి, మోనాల్ గజ్జర్ తో పాటు యష్ మాస్టర్ కూడా కంటెస్టెంట్ లకు కో-ఓనర్స్ గా వ్యవహరించబోతున్నారట. వాళ్ళు కనుక ఈ షోలో భాగమైతే కంటెస్టెంట్లలో నూతన ఉత్సాహం నింపినట్టే అని చెప్పాలి. ఈ షో కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus