Srikanth N Reddy: ఆచార్య సినిమాతో పోల్చడంతో భయపడ్డాము!

  • November 18, 2023 / 07:38 PM IST

మెగా హీరో వైష్ణవ తేజ్ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఆది కేశవ ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ నవంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు ఇందులో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఇందులో గుడి గోపురం వాటి సన్నివేశాలు కనిపించాయి

ఈ క్రమంలోనే ఈ సినిమాని కూడా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమాతో పోలుస్తూ కామెంట్లు చేశారు. ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ వివరణ ఇచ్చారు. మా సినిమా టీజర్ విడుదలైన తర్వాత ఆచార్య సినిమాతో పోల్చడంతో ఒక్కసారిగా మాకు భయం వేసిందని ఈయన తెలిపారు. మేము ఒక యాంగిల్ లో సినిమా చూపించాలి అనుకుంటే బయటకు మరొక విధంగా ప్రొజెక్ట్ అయిందని భయపడ్డాము.

ఇందులో గుడి పురాన్ని చూపించడంతో చాలామంది ఆచార్య సినిమాలో లాగా ఈ సినిమాలో కూడా ఒక గుడిని సంరక్షించే సన్నివేశంతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చామని అందరూ భావించారు. నిజానికి ఆదికేశవ సినిమాకు, ఆచార్య సినిమాకు ఎలాంటి పోలిక లేదని ఈ సినిమా పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుందని డైరెక్టర్ తెలిపారు. ఇక ఇందులో శివుడి గురించి ప్రస్తావనకు తీసుకువచ్చామని ఈయన తెలిపారు.

ఇలా చాలామంది ఆదికేశవ సినిమాని ఆచార్య సినిమాతో పోల్చడం సరికాదని ఈ సినిమా చూసిన తర్వాత పోలిక తప్పు అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని శ్రీకాంత్ తెలిపారు. ఇక ఈ సినిమా నవంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ నవంబర్ 24వ తేదీ విడుదలవుతుంది ఇక ఇందులో శ్రీ లీల నటించడంతో సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ద్వారా వైష్ణవ్ ప్రేక్షకులను మెప్పిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus