Adipurush Review in Telugu: ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 16, 2023 / 10:59 AM IST

Cast & Crew

  • ప్రభాస్ (Hero)
  • కృతి సనన్ (Heroine)
  • సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవ్ దత్తా (Cast)
  • ఓం రౌత్ (Director)
  • భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ఓం రౌత్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ (Producer)
  • సంచిత్ - అంకిత్ & అజయ్ - అతుల్ & సాచిత్ - పరంపర (Music)
  • కార్తీక్ పళని (Cinematography)

నవతరానికి రామాయణ ప్రాముఖ్యత తెలియజెప్పడం కోసం.. రామాయణ ఇతివృత్తంతో ప్రభాస్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన చిత్రం “ఆదిపురుష్”. “తానాజీ”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తొలుత గ్రాఫిక్స్ విషయంలో కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆ తర్వాత విడుదలైన పాటలు, ట్రైలర్స్ సినిమా మీద విశేషమైన బజ్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ.. ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండా రిలీజైన “ఆదిపురుష్” ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: తండ్రి దశరధుడు కైకేయికి ఇచ్చిన మాట కోసం.. తమ్ముడు శేషు (సన్నీ సింగ్), ధర్మపత్ని జానకి (కృతి సనన్)తో కలిసి 14 ఏళ్ల వనవాసానికి వెళ్తాడు రాఘవ (ప్రభాస్). రాక్షకుడి స్థాయి నుండి నారాయణుడి హోదాను పొందే వెంపర్లాటలో జానకిని ఎత్తుకొస్తాడు రావణ్ (సైఫ్ అలీఖాన్).

లంకలో బందీగా ఉన్న జానకిని.. సముద్రం దాటి.. వానర సైన్యం సహాయంతో రావణ సైన్యాన్ని ఎదిరించి చెడు పై మంచి చేసిన యుద్ధమే “ఆదిపురుష్” కథాంశం.

నటీనటుల పనితీరు: రాఘవుడిగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ & స్క్రీన్ ప్రెజన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడం ఖాయం. లుక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. అయినప్పటికీ.. ప్రభాస్ తన చరిష్మాతో లాక్కొచ్చాడనే చెప్పాలి.

జానకీ దేవిగా కృతి సనన్ బాగా సెట్ అయ్యింది. ఆమె కళ్ళలో బాధ, ఆమె ముఖంలో హావభావాలు చక్కగా పండాయి. నెగిటివిటీకి తావు లేకుండా ఆమె పాత్రను పోషించింది. కాకపోతే.. ఆమె కాస్ట్యూమ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది.

శేషుగా సన్నీ సింగ్ పర్వాలేదనిపించుకున్నాడు. భజరంగ్ పాత్రలో దేవ్ దత్తా జీవించేశాడు. ఇక రావణ్ గా సైఫ్ అలీఖాన్ నటన, బాడీ లాంగ్వేజ్, లుక్స్ ఎందుకో సింక్ అవ్వలేదు. రావణుడు ఎంత రాక్షసుడు అయినప్పటికీ.. అతడ్ని ఏదో అవెంజర్స్ లో తానోస్ రేంజ్ లో ప్రొజెక్ట్ చేయాలని తపించిన తీరు దెబ్బతిన్నది. మండోధరిగా సోనాల్ చౌహాన్ మెరిసింది.

సాంకేతికవర్గం పనితీరు: సంచిత్ & అంకిత్ ద్వయం నేపధ్య సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. కంటెంట్ వైజ్ ఉన్న మైనస్ లన్నీ బ్యాగ్రౌండ్ స్కోర్ కవర్ చేసింది. అలాగే.. అజయ్-అతుల్ & సాచిత్-పరంపరాలు సమకూర్చిన బాణీలు కూడా బాగున్నాయి.

కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ & కొన్ని ఫ్రేమింగ్స్ బాగున్నప్పటికీ.. పూర్ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా అతడి వర్క్ ఎలివేట్ అవ్వలేదు. రెండు మరియు మూడో ట్రైలర్ తో ఏదో కవర్ చేశారు కానీ.. సినిమాలో మాత్రం గ్రాఫిక్స్ విషయంలో దొరికిపోయారు మేకర్స్. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త టైమ్ తీసుకొని ఉంటే బాగుండేది. ప్రభాస్ ఇంట్రడక్షన్ ఫైట్ & క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ మరీ కార్టూన్ నెట్వర్క్ లోని షోలను తలపించడం బాధాకరం. సినిమాకి మెయిన్ & బిగ్గెస్ట్ మైనస్ గ్రాఫిక్స్ అనే చెప్పాలి.

ఇక దర్శకుడు ఓం రౌత్ పనితనం గురించి చెప్పాలంటే.. ఫస్టాఫ్ వరకూ బాగానే మ్యానేజ్ చేశాడు కానీ.. సెకండాఫ్ కి వచ్చేసరికి లేనిపోని సన్నివేశాలను, సందర్భాలు ఇరికించి.. మరీ ఎక్కువ డ్రమటైజ్ చేయాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. కాకపోతే.. ప్రభాస్ ఫ్యాన్స్ ను బాగా అర్ధం చేసుకొని రాసుకొన్న ఎలివేషన్ సీన్స్ మాత్రం బాగా వర్కవుటయ్యాయి. అలాగే.. క్యాస్టింగ్ కూడా ప్రభాస్ తప్ప అందరూ బాలీవుడ్ ఆర్టిస్టులే కావడంతో.. తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలగదు. దర్శకుడు ఓం రౌత్ రిలీజ్ డేట్ విషయంలో కంగారుపడకుండా.. సెకండాఫ్ & గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే.. “ఆదిపురుష్” చరిత్రలో నిలిచిపోయే సినిమా అయ్యేది.

విశ్లేషణ: మనం చిన్నప్పట్నుంచి వింటూ, చదువుతూ, చూస్తూ వచ్చిన రామాయణం వేరు.. “ఆదిపురుష్”లో చూపించే రామాయణం వేరు. అచ్చుగుద్దినట్లుగా వాల్మీకి రామాయణంలా ఉంటుందనుకొని థియేటర్లకు వెళ్ళకండి.. నవతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కొన్ని భారీ మార్పులు చేశారు. మరీ ముఖ్యంగా.. కీలకమైన ఘట్టాల సీన్ కంపోజిషన్స్ “ఏంటీ ఇలా జరిగిందా?” అనే ఆశ్చర్యంతో కూడిన ప్రశ్నల్ని లేవనెత్తుతాయి. అందుకే చిత్రబృందం.. సినిమా ప్రారంభంలోని “సినిమాటిక్ లిబర్టీస్ కోసం మూలకథలో మార్పులు చేయకుండా.. సినిమాటిక్ గా కొన్ని మార్పులు చేశాం” అని చెప్పేశారు. సో, పాతకాలం రామాయణాలతో పోల్చకుండా, గ్రాఫిక్స్ ను పట్టించుకోకుండా.. ప్రభాస్ చరిష్మా & అద్భుతమైన నేపధ్య సంగీతం కోసం “ఆదిపురుష్”ను కచ్చితంగా కుటుంబంతో కలిసి చూడొచ్చు.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus