‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు కావస్తోంది. మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయి. కానీ సోమవారం నుండి అమాంతం పడిపోయాయి. వీక్ డేస్ లో డ్రాప్స్ ఉండటం సహజం.. కానీ ‘ఆదిపురుష్’ విషయంలో ఇంకాస్త ఎక్కువ డ్రాప్స్ కనిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం టికెట్ రేట్లు అధికంగా ఉండటం. తెలంగాణలో చూసుకుంటే ‘ఆదిపురుష్’ 2D టికెట్ రేట్లు రూ.295 , రూ.350 గా ఉండగా, 3D టికెట్ రేట్లు రూ.330 , రూ.385 గా ఉన్నాయి.
జి.ఎస్.టి లు వంటివి కలుపుకుని ఇంకా ఎక్కువే ఉంటున్నాయి. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి.. టికెట్ రేట్లు వీకెండ్ తర్వాత తగ్గించి ఉండుంటే.. కలెక్షన్స్ ఇంకాస్త బెటర్ గా ఉండేవి. కానీ చిత్ర బృందం అలాంటి స్టెప్ ఏమీ తీసుకోలేదు. అయితే నార్త్ లో మాత్రం ‘ఆదిపురుష్'(హిందీ) 3D కి టికెట్ రేటు రూ.150 పెడుతున్నారు. అక్కడ తీసుకుంటుంది సరైన నిర్ణయమే అని చెప్పాలి. మరి తెలుగులో ఎందుకు (Adipurush) ‘ఆదిపురుష్’ మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అనే విషయం పై క్లారిటీ రావడం లేదు. ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ అవ్వడం లేదు కాబట్టి.. ‘ఆదిపురుష్’ కి కలిసొచ్చే అవకాశం ఉంది. రెండో వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకునే ఛాన్స్ లు కూడా ఉన్నాయి. మారేందుకు టీం ఈ విషయమై సీరియస్ గా తీసుకోవడం లేదు అని సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలయ్యాయి.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్