Adipurush: ఆది పురుష్ నటి తేజస్విని పండిట్ ఇన్ని కష్టాలను అనుభవించారా?
July 4, 2023 / 07:56 PM IST
|Follow Us
ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం ఆది పురుష్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ గత నెల 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఇక ఈ సినిమా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఇతర భాష సెలబ్రిటీలను కూడా ఇందులో భాగమైన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సూర్పనఖ పాత్రలు మరాఠీ నటి తేజస్విని పండిట్ నటించారు. ఇలా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు.
అయితే తాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తేజస్విని పండిట్ తన గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. (Adipurush) ఆది పురుష్ వంటి ఒక పాన్ ఇండియా సినిమాలో భాగం కావడం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. అయితే ఇందులో నా నటనను చూసి చాలామంది నా గురించి గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఇది చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నన్ను వెస్ట్రన్ ఔట్ ఫిట్ లో చూసి చాలామంది ఆశ్చర్యపోయారు దానికి నేనేమీ చేయలేను.
నా వరకు వచ్చిన అవకాశాలను మాత్రమే వినియోగించుకున్నానని తెలిపారు.. ఇక తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ తన తండ్రి టీ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలో పనిచేసేవారు. తనకు ఒక సోదరి కూడా ఉందని తెలిపారు. అయితే చిన్నప్పుడు తాము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని తెలిపారు. ఒకానొక సమయంలో కనీసం తినడానికి తిండి కూడా లేకపోవడంతో ఇంట్లో ఉన్న పిండితోనే బిస్కెట్లు తయారు చేసుకొని తిన్నామని ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుందని తెలిపారు. చేతిలో డబ్బు ఉండేది కాదు… ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు కేవలం అప్పులు మాత్రమే ఉండేవని ఈమె తెలిపారు.
ఇలా తినడానికి కూడా తిండి లేకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డామని అవన్నీ తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయని తెలిపారు. అయితే ఆ బాధలను చూసి అక్కడే ఆగిపోలేదని ధైర్యంతో ముందడుగు వేసి ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ ఈ సందర్భంగా తేజస్విని పండిట్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక 2012 వ సంవత్సరంలో తన స్కూల్స్ స్నేహితుడిని పెళ్లి చేసుకున్నానని అయితే కొన్ని కారణాల వల్ల మేమిద్దరం విడాకులు తీసుకొని విడిపోయాము అంటూ ఈమె తెలియజేశారు.