తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసమేనా ఈ హడావుడి?

  • February 16, 2019 / 07:44 PM IST

హీరోయిన్ గా ఇండస్ట్రీలో అవకాశం దక్కించుకోవడం పెద్ద విషయం కాదు.. ఒక అయిదారు సినిమాలు చేస్తే అందులో ఒకటి హిట్ అవ్వడం కూడా పెద్ద సమస్య కాదు. కానీ.. ఒక హీరోయిన్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొని ఆ గుర్తింపును కొనసాగించడమే పెద్ద పని. హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా నేను ఇక్కడే ఉన్నా అంటూ ఉనికిని చాటుకోవడానికి మన హీరోయిన్లు పడే కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు ఆ కష్టాలు మన హైద్రాబాదీ హీరోయిన్ అయిన అదితిరావు హైదరీకి కూడా తప్పలేదు.

హైద్రాబాద్ కు చెందిన అదితిరావు హైదరీ ఇక్కడ కథానాయికగా పరిచయమవ్వడానికంటే ముందే బాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేసి తన పాపులారిటీ పెంచుకుంది. ఎన్ని సినిమాల్లో నటించినా ఆమెకు రాని పాపులారిటీ “చెలియా, సమ్మోహనం”తో వచ్చాయి. అందుకు కారణం ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఫాలోయింగే. కానీ.. ఎందుకో ఆమెకు “అంతరిక్షం” తర్వాత తెలుగులో మరో అవకాశం లభించలేదు. దాంతో అర్జెంట్ గా ఆమె తన ఉనికిని కాపాడుకోవడం ముఖ్యం అనుకుందో ఏమో కానీ.. ఒక కొత్త ఫోటోషూట్ చేయించుకొని ఇంటర్నెట్ లో వదిలింది. ఆ కొత్త ఫోటోలు చూసి జనాలు ఫిదా అవుతున్నారు బాగానే ఉంది కానీ.. మరి ఆ ఫోటోలు అమ్మడికి ఆఫర్లు తెచ్చిపెడతాయా లేదా అనేది మాత్రం చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus