Aditi Rao Hydari: అదితిరావు హైదరీ పారితోషికం తెలిస్తే షాకవ్వాల్సిందే?

  • October 13, 2021 / 11:00 AM IST

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల థియేటర్లలో రిలీజైన సినిమాలకు హిట్ టాక్ వస్తే తప్ప భారీగా కలెక్షన్లు రావడం లేదు. ఏపీలోని థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు లేకపోవడం, టికెట్ రేట్లు తగ్గడంతో తెలుగు సినిమాలు నిర్మాతలు ఆశించిన స్థాయిలో సినిమాలు కలెక్షన్లు సాధించడం లేదు. అయితే హీరోల, హీరోయిన్ల పారితోషికాలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మహాసముద్రం సినిమాలో అదితిరావు హైదరీ ఒక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఈ హీరోయిన్ పారితోషికం ఏకంగా కోటి రూపాయలు అని తెలుస్తోంది. పెద్దగా విజయాలు లేని అదితిరావు హైదరీ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం ఇండస్ట్రీకి చెందిన వాళ్లను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదితీరావు సన్నిహిత వర్గాల నుంచి అదితి రెమ్యునరేషన్ గురించి ఈ మేరకు సమాచారం అందుతోంది. మహా సముద్రం సినిమా ప్రమోషన్స్ లో అదితిరావు హైదరీ మాట్లాడుతూ తాను తెలుగు అమ్మాయినని తనకు మరిన్ని తెలుగు సినిమాలలో నటించాలని ఉందని చెప్పుకొచ్చారు.

మహాసముద్రం సినిమాతో అదితిరావు హైదరీ ఖాతాలో సక్సెస్ చేరుతుందో లేదో చూడాల్సి ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అదితిరావు పలు సినిమాల్లో నటిస్తుండటం గమనార్హం. మహాసముద్రం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ అదితిరావు హైదరీ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. తెలుగులో అదితిరావు హైదరీ సమ్మోహనం, అంతరిక్షం, సైకో సినిమాలలో నటించగా సమ్మోహనం మినహా మిగతా సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus