నాకు పెళ్లి కంటే ఇంపార్టెంట్ వర్క్స్ చాలా ఉన్నాయి

  • February 20, 2019 / 07:27 PM IST

ఒక్కోసారి సోషల్ మీడియా హైప్ అనేది హీరోహీరోయిన్ల కెరీర్ ను ప్రోబ్లమేటిక్ గా మారుతుంది. రీసెంట్ గా ఆ తరహా ఇబ్బందిని ఎదుర్కొన్నది అడివి శేష్. ఈ కుర్రాడు రీసెంట్ గా తన ట్విట్టర్ లో “త్వరలోనే ఓ శుభవార్త” చెప్తాను అని పోస్ట్ చేశాడు. దాంతో అందరూ అది అతడి పెళ్లి వార్త అనుకొన్నారు. అది సరిపోదు అన్నట్లు.. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో త్వరలోనే మనోడి పెళ్లి ఓ అగ్ర కథానాయకుడి కుటుంబానికి చెందిన అమ్మాయితో జరుగుతుందని గాసిప్పు వచ్చింది. ఆవిడ ఎవరు అనేది కొందరికి క్లారిటీ ఉన్నప్పటికీ.. ఆమె పేరును మాత్రం ఎవరూ పైకి చెప్పడం లేదు.

కానీ.. ఈ విషయమై కాస్త ఘాటుగా స్పందించిన అడివి శేష్. ప్రస్తుతం నా లైఫ్ లో పెళ్లి అనే మాటకు ప్రస్తావన లేదు. నా దృష్టి మొత్తం కేవలం సినిమాల మీద ఉంది” అని ఒక ట్వీట్ పెట్టాడు అడివి శేష్. అయితే.. అడివి పెళ్లి చేసుకోవడం ఇక్కడ మేటర్ కాదు.. ఆ అగ్ర కథానాయకుడి కుటుంబానికి చెందిన లేడీని ఆమె చేసుకుంటుందా లేదా అనేదే ఇక్కడ మేటర్. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus