Adivi Sesh: అడివి శేష్‌ కొత్త సినిమా గురించి అదిరిపోయే ఇన్ఫో!

  • December 4, 2022 / 12:50 AM IST

అడివి శేష్‌ని చూసినప్పుడు.. వీడు టాలీవుడ్‌ మెటీరియల్‌ కాదు అని అనిపిస్తుంటుంది. కారణం హైట్‌, కలర్‌, యాక్సెంట్‌, లుక్‌.. ఇలా చాలానే ఉన్నాయి. అయితే ఎందుకో కానీ.. ఇక్కడే ఉండిపోయాడు అని కూడా అనిపిస్తుంది. అయితే ‘మేజర్‌’ సినిమాతో పాన్‌ ఇండియాలో తెలిశాడు అనుకోండి. అయితే ఇప్పుడు శేష్‌ నెక్స్ట్‌ సినిమా గురించి వచ్చిన వార్తలు వింటుంటే.. శేష్‌ ఏదో డిఫరెంట్‌ స్టెప్‌ వేస్తున్నాడు అనిపిస్తోంది. ఎందుకంటే నెక్స్ట్‌ మూవీ ఆస్కార్‌ అవార్డ్‌ అందుకున్న సినిమాకు రీమేక్‌.

కెరీర్ ఆరంభంలో నటుడిగా, దర్శకుడిగా ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ తర్వాత జాగ్రత్తగా అడుగులు వేశాడు అడివి శేష్. రచయితగా, హీరోగా మంచి పేరు సంపాదించాడు. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’ అంటూ వైవిధ్యమైన ఆలోచనలతో సినిమాలు చేస్తున్నాడు. దీని తర్వాత శేష్ చేసే సినిమా విషయంలో ఆసక్తికర విషయం ఒకటి బయటకొచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు శేష్ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు. అయితే దర్శకుడు ఎవరు? కథేంటి, ఎలా ఉండొచ్చు లాంటి వివరాలు ఏవీ చెప్పలేదు.

అయితే ‘గూఢచారి 2’ సినిమా కూడా లైన్‌లో ఉంది. ఇవి కాకుండా శేష్‌ శేష్ మరొక ఇంట్రెస్ట్రింగ్ ప్రాజెక్టు గురించి చెప్పాడు. ‘హిట్ 2’ ప్రచారంలో భాగంగా శేష్‌ మాట్లాడుతూ ఆస్కార్ విన్నింగ్ మూవీ తెలుగు రీమేక్‌లో నటించనున్నట్లు చెప్పాడు. ఆ ఒరిజినల్‌ సినిమాను నిర్మించిన హాలీవుడ్ నిర్మాణ సంస్థే ఈ చిత్రాన్ని తెలుగులోనూ ప్రొడ్యూస్ చేస్తోందని చెప్పాడు. హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ అన్నాడు, ఆ కథే అంటున్నాడు కానీ ఆ వివరాలేవీ చెప్పలేదు శేష్‌.

అయితే ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుందనేది కచ్చితం. ఇక ‘గూఢచారి 2’ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మూల కథ కుదిరింది.. దాన్ని స్క్రిప్టుగా తీర్చిదిద్దాల్సి ఉంది. ప్రస్తుతం టీమ్‌తో ఈ పనిలోనే ఉన్నాడట. సినిమా సెట్స్‌ మీదకు వెళ్లడానికి ఇంకా చాలా టైమ్‌ పడుతుందట.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus