అడివి శేష్, శివానీ రాజశేఖర్ ‘2 స్టేట్స్’ ప్రారంభం
March 24, 2018 / 11:57 AM IST
|Follow Us
అడవి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా ‘2 స్టేట్స్’ చిత్రం శనివారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. చేతన్‌భగత్ రచించిన ‘2 స్టేట్స్’ నవల ఆధారంగా హిందీలో ‘2 స్టేట్స్’ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. వెంకట్ కుంచం దర్శకుడు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ ఇచ్చారు. కృష్ణంరాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. కోడి రామకృష్ణ, వి.వి.వినాయక్, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘‘2 ేస్టట్స్’ సినిమా తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. సినిమాను మూడు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం. మొదటి షెడ్యూల్‌ను ఏప్రిల్ 5 నుండి 19 వరకు హైదరాబాద్‌లో చేస్తాం. రెండవ షెడ్యూల్‌ను మే నెలలో కోల్‌కతాలో చేసి, మూడో షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
అడివి శేష్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు వెంకట్ నాకు మంచి మిత్రుడు. ఈ కథతో పూర్తిగా జర్నీ చేశా. హిందీలో మూడుసార్లు చూశా. ఎప్పటి నుంచో ఇలాంటి కథలో నటించాలనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కోరిక తీరబోతుంది. మంచి టీమ్ కుదిరింది. శివానీతో నటించడం హ్యాపీగా ఉంది’’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ – “నేను హిందీలో వచ్చిన `టు స్టేట్స్` సినిమా చూశాను. సంగీతానికి చాలా స్కోప్ ఉన్న చిత్రమిది. మంచి టీం కుదిరింది. ఎం.ఎల్.వి.సత్యనారాయణ వంటి ప్యాషనేట్ నిర్మాతతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది“ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ శానియల్ డియో మాట్లాడుతూ – “ క్షణం తర్వాత అడివిశేష్‌తో చేయబోతున్న మరో చిత్రమిది. శేష్, శివాని జంట బావుంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చేలా రూపొందుతుంది“ అన్నారు.
సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ – “మా పీపుల్ మీడియా బ్యానర్ అసోసియేషన్‌లో `టు స్టేట్స్` రానుండటం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో మంచి సినిమాలనే తెలుగు ప్రేక్షకులకు అందిస్తాం“ అన్నారు.
దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ ‘‘ఓ కథని అడాప్ట్ చేసుకుని సినిమా చేయడం అంత సులువు కాదు. ‘2 ేస్టట్స్’ స్ర్కిప్ట్‌పై చాలా వర్క్ చేశా. రచయితలు మధు శ్రీనివాస్, మిథున్ చక్రవరి చాలా సహకరించారు. అనూప్ ఇప్పటికే మూడు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. మంచి సినిమాగా తీర్చిదిద్దేందుకు అందరం కష్టపడతాము’’ అని తెలిపారు.
శివానీ రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘సవాల్ ఉన్న పాత్రను నేను పోషించగలనని నమ్మి దర్శకుడు నాకీ అవకాశం ఇచ్చారు. అనూప్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. నా మొదటి సినిమాకు ఆయన సంగీత దర్శకుడు కావడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.