Srinivasa Chitturi: మొత్తానికి ‘నా సామి రంగ’ తో ఆయనకి మొదటి హిట్ పడింది!
January 23, 2024 / 03:55 PM IST
|Follow Us
కొంతమంది నిర్మాతలు ఎంత ప్యాషన్ తో సినిమాలు తీసినా ఎందుకో వారికి సక్సెస్ వెంటనే దొరకదు. పదుల సంఖ్యలో సినిమాలు నిర్మించినా సక్సెస్ కానీ ప్రొడక్షన్ హౌస్..లు టాలీవుడ్లో చాలానే ఉన్నాయి. కొన్ని ఇప్పటికే రేసులో నుండి తప్పుకున్నాయి. ఇంకా కొన్ని మాత్రం చిన్న చితకా సినిమాలు నిర్మిస్తూ హిట్లు కోసం వెయిట్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఆ విషయాలను పక్కన పెట్టేస్తే..! నిర్మాత శ్రీనివాసా చిట్టూరి అందరికీ సుపరిచితమే. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యూ టర్న్’ మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు.
ఆ సినిమా యావరేజ్ రిజల్ట్ ను సరిపెట్టుకుంది. ఆ తర్వాత ‘సీటీమార్’ చేశాడు. అది యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అటు తర్వాత రామ్ తో ‘ది వారియర్’ ‘స్కంద’, నాగ చైతన్యతో ‘కస్టడీ’ వంటి సినిమాలు చేశారు. ఇవి బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ గా మిగిలాయి. అయితే నాగార్జునతో చేసిన ‘నా సామి రంగ’ మూవీ అతనికి మొదటి కమర్షియల్ హిట్ ను అందించింది.
విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 14 న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. పండుగ సెలవులు సినిమాకి బాగా కలిసొచ్చాయి. సినిమా రూ.20 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. కేవలం 3 నెలల్లో తీసిన సినిమా ఇది. ముందు సినిమాలకి ఎక్కువ టైం తీసుకున్నారు. కానీ విచిత్రంగా 5 ఏళ్ళకి ‘నా సామి రంగ’ నే ఈయనకి (Srinivasa Chitturi) మొదటి సక్సెస్ ను అందించింది.