రానా సాయంతో మళ్ళీ టాలీవుడ్ సినిమాలో నటించబోతుందట..!

  • June 4, 2021 / 07:51 PM IST

హీరోయిన్లు రీ ఎంట్రీ వార్తలు మనకి కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న హీరోయిన్ రీ ఎంట్రీ వార్త కొంచెం స్పెషల్ అని చెప్పాలి. 2012లో యం.యస్.రాజు కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘తూనిగ తూనిగ’. ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది రియా చక్రవర్తి. ఆ సినిమా నిరాశపరచడంతో ఈ అమ్మడు వెంటనే బాలీవుడ్ కు చెక్కేసింది.అక్కడ కూడా ఈమె రాణించింది ఏమీ లేదు. ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేయడం వలన ఈమెకు లీడ్ రోల్స్ అనేవి ఎక్కువ రాలేదు.

అలా ఛాన్స్ లు రావడం లేదని కాదు. చేతినిండా ఆఫర్లతో బిజీగానే గడిపేది.దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచేది ఈ బ్యూటీ. ఇక డ్రగ్స్ వ్యవహారంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరే ఇక అసలు మేటర్ ఏంటంటే.. త్వరలోనే ఈ అమ్మడు టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వబోతుందట.ఆల్రెడీ తన ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి పలు ప్రొడక్షన్ హౌస్ లను సంప్రదించిందట. కానీ ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాకపోవడంతో..

దగ్గుబాటి రానా సాయం కోరిందట. ఓ పక్క హీరోగా చేస్తూనే మరోపక్క ‘కేరాఫ్ కంచెరపాలెం’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి విభిన్న చిత్రాలను నిర్మించి సక్సెస్ లు అందుకున్నాడు రానా. ఇప్పుడు మరో 5 కొత్త సినిమాలను నిర్మించడానికి రెడీ అయ్యాడట. వాటిలో ఏదో ఒక సినిమా ద్వారా రియా చక్రవర్తిని మళ్ళీ టాలీవుడ్ కు తీసుకురావాలని అతను భావిస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus