మహిళా దర్శకులతో వరుసగా రెండుసార్లు ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న గునీత్ మోంగా..
March 13, 2023 / 06:32 PM IST
|Follow Us
2023 ఆస్కార్ వేడుక ప్రారంభంలోనే ఖాతా తెరిచి అందర్నీ ఆశ్చర్య పరిచింది ఓ షార్ట్ ఫిల్మ్.. ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఇండియన్ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. ఈ సంవత్సరం మన దేశం నుంచి ‘ఆల్ దట్ బ్రీత్స్’, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే..బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అకాడమీ అవార్డ్ గెలుచుకుంది..
ఏనుగులు, వాటితో మనిషికున్న అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అవార్డు సాధించడం విశేషం.. 42 నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసం 450 గంటల ఫుటేజీ షూట్ చేశారంటే మామూలు విషయం కాదు.. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కార్తికి గొన్సాల్వేస్ దర్శకత్వం వహించగా.. గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించారు..ఈ ఏడాది ఆస్కార్స్‌కి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ తో పాటు ‘హలౌట్’, ‘ది మార్తా మిట్చెల్ ఎఫెక్ట్’, ‘స్ట్రేంజర్ ఎట్ ది గేట్’, ‘హౌ డు యూ మెజర్ ఏ ఇయర్’ వంటి షార్ట్ ఫిలిమ్స్ కూడా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయ్యాయి.
చివరకు ఇండియన్ షార్ట్ ఫిలింని అవార్డు వరించడంతో భారత సినీ ప్రేక్షకుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.. అనాథ అయిన ఏనుగు, ఓ దంపతుల మధ్య అనుబంధం నేపథ్యంలో అద్బుతంగా తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.. కాగా, నిర్మాత గునీత్ మోంగా ఈ చిత్రంతో రెండోసారి ఆస్కార్ అందుకోవడం విశేషం.. ఇండియాకి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైం కాదు..
ఇప్పుడు ఆస్కార్ గెలుపొందిన ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా.. 2018లో ‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్’ (Period. End of Sentence) అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ నిర్మించారు. ఇరానియన్ – అమెరికన్ ఫిలిం మేకర్ రైకా జెహ్‌తాబ్చి (Rayka Zehtabchi) అనే మహిళా దర్శకురాలు తెరెక్కించారు.. 2019 బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్’ ఆస్కార్ గెలుపొందింది.
ఈ లెక్కన నిర్మాత గునీత్ మోంగాని ఆస్కార్ వరించడం ఇది రెండోసారి. ఆమె నిర్మించిన రెండిటికీ మహిళలే దర్శకులు కావడం డబుల్ విశేషం.. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులను (స్లమ్ డాగ్ మిలియనీర్) అందుకున్నారు. ఇప్పుడదే బాటలో గునీత్ మోంగా చేరడం విశేషం..