నాలుగేళ్ల తరువాత స్టేజ్ పై సల్మాన్..!

  • May 23, 2016 / 07:56 AM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. దాదాపు నాలుగేళ్ల తరువాత స్టేజ్ పై డ్యాన్స్ ఫర్ఫామ్ చేయనున్నాడు. జూన్ 23 నుంచి 26 వరకు స్పెయిన్ మ్యాడ్రిడ్ లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐఫా) జరగనుండగా.. ఈ ఉత్సవంలో సల్మాన్ డ్యాన్స్ చేయనున్నాడు. ‘నేను పర్ఫామెన్స్ గురించి ఆలోచించడం లేదు. అయితే టైగర్ శ్రోఫ్, హృతిక్ రోషన్ ల లాగా నా నుంచి డ్యాన్స్ మీరు ఆశించొద్ద’ని సల్మాన్ తెలిపాడు.

గత కొద్ది సంవత్సరాల నుంచి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటం వల్లనే తాను ఇతర కార్యక్రమాల్లో పాల్గొనలేక పోయానని సల్మాన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం సల్మాన్ ‘సుల్తాన్’ చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు పీతమ్. మీట్ బ్రదర్స్, బెన్ని దయాళ్, కనిఖా కపూర్, మోనాలి ఠాకూర్, నీతి మోహన్, పపోన్ తదితరులు ఐఫా లో సంగీత ప్రదర్శనలు ఇవ్వనుండగా.. పలువురు బాలీవుడ్ తారలు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకొనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus