Akhil: ఏజెంట్ మూవీ రిజల్ట్ అఖిల్ ను ఇంతలా బాధ పెట్టిందా?

  • May 4, 2023 / 01:30 PM IST

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అనిల్ సుంకర నిర్మాతగా దాదాపుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. ఏజెంట్ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రాలేదు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. అయితే ఈ సినిమా ఫలితం వల్ల అఖిల్ హర్ట్ అయ్యారని సమాచారం అందుతోంది.

ఏజెంట్ మూవీ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో అఖిల్ డిప్రెషన్ లోకి వెళ్లాడని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఏజెంట్ సినిమా గురించి నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వైరల్ అవుతున్న నేపథ్యంలో అఖిల్ దుబాయ్ కు వెళ్లాడని సమాచారం అందుతోంది. అఖిల్ డిప్రెషన్ నుంచి బయటకు వెళ్లడానికి దుబాయ్ కు సింగిల్ గా వెళ్లాడని తెలుస్తోంది. అఖిల్ దుబాయ్ కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కెరీర్ పరంగా అఖిల్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అఖిల్ వరుసగా విజయాలను అందుకోవాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అఖిల్ తర్వాత సినిమాకు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. కెరీర్ పరంగా వరుస విజయాలు సాధిస్తే మాత్రం అఖిల్ కచ్చితంగా మరో లెవెల్ కు వెళతారని చెప్పవచ్చు. అఖిల్ రెమ్యునరేషన్ కూడా తక్కువగానే ఉందని తెలుస్తోంది.

రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లు (Akhil)అఖిల్ పై దృష్టి పెడితే మాత్రం అఖిల్ కెరీర్ మామూలుగా ఉండదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగ్, చైతన్య, అఖిల్ కలిసి నటిస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. ఏజెంట్ రిజల్ట్ తో సురేందర్ రెడ్డి కెరీర్ రిస్క్ లో పడింది. ఏజెంట్ తరహా కథాంశాలు చాలా రిస్క్ అని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus