Agent Review In Telugu: ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 28, 2023 / 11:52 AM IST

Cast & Crew

  • అఖిల్ (Hero)
  • సాక్షి వైద్యా (Heroine)
  • మమ్ముట్టి , డినో మోరియా, మురళీ శర్మ , పోసాని కృష్ణమురళి (Cast)
  • సురేందర్ రెడ్డి (Director)
  • రామబ్రహ్మం సుంకర – అజయ్ సుంకర – పత్తి దీపా రెడ్డి (Producer)
  • హిప్ హాప్ తమిళ (Music)
  • రసూల్ ఎల్లోర్ (Cinematography)

అఖిల్ అక్కినేని టైటిల్ పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై ఎంటర్ టైనర్ “ఏజెంట్”. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. విడుదలైన టీజర్ & ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను నమోదు చేశాయి. మరి సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: చిన్నప్పుడు తన కళ్ళముందే తన స్నేహితులందరూ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోవడంతో.. ఏజెంట్ కావాలని కలలుగంటూ.. అందుకు తగ్గట్లు ట్రైనింగ్ తీసుకుంటూ, రా ఏజెన్సీ చీఫ్ మహదేవ్ (మమ్ముట్టి)ని ఇన్స్పిరేషన్ గా బ్రతుకుతుంటాడు రిక్కీ (అఖిల్ అక్కినేని).

ఎట్టకేలకు ఒక సీక్రెట్ మిషిన్ తో రంగంలోకి దిగుతాడు రిక్కీ. ఆ తర్వాత రిక్కీ ప్రయాణం ఎలా సాగింది? రిక్కీ తన సత్తాను చాటుకున్నాడా? అనేది “ఏజెంట్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: అఖిల్ ఈ సినిమా కోసం పడిన కష్టం ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. తన లుక్స్ & మ్యానరిజమ్స్ విషయంలో కొత్తదనం కోసం పరితపించిన అఖిల్, తన స్థాయికి మించి సినిమాలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. వైల్డ్ ఏజెంట్ గా అఖిల్ నటన, అతడి ఆహార్యం, ఫైట్స్ లో ఈజ్ & యాక్షన్ బ్లాక్స్ లో బిహేవియర్ ఆడియన్స్ ను అలరిస్తాయి.

మమ్ముట్టి మాత్రం ఆయన మార్క్ ను సినిమాలో చూపించలేకపోయారు. ఆయన పాత్రకి ఉన్న వెయిటేజ్ & స్క్రీన్ ప్రెజన్స్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు చిత్రబృందం.

సాక్షి వైద్య అందంగా కనిపించింది కానీ.. నటిగా మాత్రం ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. బాలీవుడ్ నటుడు డినో మోర్ మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ నేపధ్య సంగీతం సినిమాకి హై ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ను బ్యాగ్రౌండ్ స్కోర్ తో అద్భుతంగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఎందుకో సరిగా చేయలేకపోయాడు. పాటల వరకూ పర్వాలేదనిపించుకున్నాడు.

రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది. యాక్షన్ బ్లాక్స్ ను సరిగా కంపోజ్ & ఎలివేట్ చేయలేకపోయారు. నిజానికి ఈ తరహా స్పై థ్రిల్లర్స్ కు ఉండాల్సింది మంచి కెమెరా వర్క్. అదే ఈ సినిమాలో లోపించడం మైనస్ గా మారింది. వక్కంతం వంశీ అందించిన కథ కొత్తగా ఉన్నా.. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.

దర్శకుడు సురేందర్ రెడ్డి కి ఉన్న ఇమేజ్ కి.. స్పై థ్రిల్లర్ అనగానే ఆడియన్స్ భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ అంచనాలను సురేందర్ రెడ్డి పూర్తిస్థాయిలో అందుకోలేకపోయాడు. అఖిల్ క్యారెక్టర్ ఆర్క్ ను డీల్ చేసిన విధానం బాగుంది. అయితే.. మిగతా పాత్రలు మరియు స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం తడబడ్డాడు.

విశ్లేషణ: ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా.. థియేటర్ కి వెళ్తే మాత్రం ఓ మోస్తరుగా ఆకట్టుకొనే చిత్రం “ఏజెంట్”. అఖిల్ కష్టం & క్యారెక్టర్ ఆర్క్ కోసం ఈ చిత్రాన్ని చూడొచ్చు.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus