నిన్న “అజ్ణాతవాసి” ఆడియో విడుదల వేడుక ఎంత ఘనంగా జరిగింది, ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏస్థాయిలో హంగామా చేశారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ తిరుగులేని వాగ్ధాటి, పవన్ కళ్యాణ్ ప్రసంగం, వక్తలు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన విశేషాలు అబ్బో ఇలా చాలా అద్భుతంగా జరిగింది నిన్నటి వేడుక. అయితే.. ఈ వేడుకలో హైలైట్స్ తోపాటు కొన్ని సైడ్ లైట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
పవన్ కళ్యాణ్ పాపులర్ సాంగ్స్ ను వీణతో మ్రోగించి శ్రీవాణి అమితంగా అలరించగా.. చెన్నై కి చెందిన సింగర్ నిరంజనా రమణన్ “స్వాగతం కృష్ణా” అనే పాట పాడిన విధానం, వేణుగోపాల్ సాండ్ ఆర్ట్ లో పవన్ కళ్యాణ్ 25 సినిమాల టైటిల్స్ ను ప్రెజంట్ చేయడం, ముఖ్యంగా “ఖుషి” టైటిల్ కి తగ్గట్లుగా భూమిక నడుము చూస్తున్న పవన్ కళ్యాణ్ ప్రతిమను ప్రెజంట్ చేసిన తీరు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకొంది.
అదే సమయంలో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఈ వేడుకలో నిర్వాహకులు చాలా పెర్ఫార్మెన్స్ లు ప్లాన్ చేసుకొన్నారు. కానీ.. యాంకర్ సుమ ఆరు గంటలకల్లా వెన్యూకి రావాల్సి ఉండగా ట్రాఫిక్ కారణంగా లేట్ అవ్వడంతో 7 గంటలకి వచ్చింది. లైవ్ స్టార్ట్ అయ్యేసరికి 7.30 అయ్యింది. అందువల్ల జె మీడియా వారు ప్లాన్ చేసిన పెర్ఫార్మెన్స్ లు క్యాన్సిల్ అయ్యాయి. పాపం రెడీ అయ్యి కూర్చున్న డ్యాన్సర్స్ అందరూ బిక్కమోహాలు వేసుకొని తిరిగి వెళ్ళిపోయారు. దీనివల్ల దాదాపు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది ఆడియో నిర్వహకులకి.
అయితే.. పవన్ కళ్యాణ్ నామస్మరణలో పెర్ఫార్మెన్స్ లను పెద్దగా పట్టించుకోని పవన్ అభిమానులు మాత్రం సంతృప్తిగా, సేఫ్ గా ఇళ్లకు చేరారు.