పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల అజ్ఞాతవాసి ఎలా ఉందంటే?
January 9, 2018 / 03:29 PM IST
|Follow Us
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరూ కలిస్తే హిట్టే. ముఖ్యంగా వీరిద్దరి కలయికలో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ అయితే ఎన్నో రికార్డులను తిరగరాసింది. అందుకే ఈ కాంబోపై సినీ విశ్లేషకులు ధీమాగా ఉన్నారు. అభిమానుల్లో మాత్రం ఈ సినిమాని తొలి షో చూడాలని ఆత్రంతో పాటు.. ఎలా ఉండబోతోందో అనే ఆందోళన కూడా కొంత ఉంది. అటువంటి వారికోసమే అజ్ఞాతవాసి ఫస్ట్ రివ్యూ…
ఫ్యామిలీ కథ
అటు పవన్ ఫ్యాన్స్ ని , ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లో కూర్చో పెట్టే కథను రాసుకొని త్రివిక్రమ్ తొలి అడుగుతోనే విజయాన్ని అందుకున్నారు. ఫ్యాన్స్ ని మెప్పించే.. ఫ్యామిలీ ఆడియన్స్ ని రప్పించే కథ.. కథనం.. అజ్ఞాతవాసిలో ఉన్నాయి.
వన్ మ్యాన్ షో
అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కల్యాణ్ మేనరిజంతో మెస్మరైజ్ చేశాడు. ఆడించాడు. పాడించాడు.
ఆటకట్టించాడు. అన్ని విధాలుగా అదరగొట్టాడు. మొదటి నుంచి చివరి వరకు సినిమా పవన్ వన్ మ్యాన్ షోగా సాగింది.
అను, కీర్తి.. అదరహో
కీర్తి సురేష్ ఇందులోనూ అభినయంతో ఆకట్టుకుంది. అను ఇమ్యానుయేల్ తన అందం తో ఆకర్షించింది. వీరు పవన్ తో చేసిన సందడి సినిమాని మరోస్థాయికి చేర్చింది.
డైలాగ్స్ అదుర్స్
అజ్ఞాతవాసి చిత్రంలో త్రివిక్రమ్ మరింత పదునైన పదాలతో డైలాగ్స్ రాసారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో ఉన్న డైలాగ్స్ ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటాయి. అలా తన డైలాగ్స్ తో సూపర్ ఎండింగ్ ఇచ్చారు.
ఫైట్స్
మాస్ కి ఎన్ని ఉన్నా ఫైట్స్ లేకుంటే కిక్ ఉండదు. అందుకే పవన్ తో దిమ్మదిరిగే ఫైట్స్ చేయించారు త్రివిక్రమ్. ఇదివరకు ఏ చిత్రంలో పవన్ చేయని యాక్షన్ సీన్ ఇందులో ఉంది. ఇది ఫ్యాన్స్ కి కనువిందు చేయనుంది.
మ్యూజిక్
అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ తోనే అజ్ఞాతవాసి సగం హిట్ అనే సంగతి రిలీజ్ కి ముందే తెలిసిపోయింది. అతను కంపోజ్ చేసిన పాటలు వెండితెరపై మరింత అందంగా త్రివిక్రమ్ ఆవిష్కరించారు. నేపథ్య సంగీతంతోను అనిరుధ్ కేక పుట్టించారు.
కొత్త కోణం
సినిమాటోగ్రాఫర్ మణికందన్ కెమెరా పనితనం ఆడియన్స్ ని ఆశ్చర్యపరచనుంది. ముఖ్యంగా పాటలు, ఫైట్స్ లో అతను చూసిన.. చూపించిన కోణం కొత్త అనుభూతిని ఇవ్వనుంది.
ఫైనల్ గా హ్యాట్రిక్ హిట్
అనుమానాలను చీల్చుకుంటూ.. అంచనాలను బీట్ చేస్తూ అజ్ఞాతవాసి పవన్, త్రివిక్ర్రమ్ కాంబో కి హ్యాట్రిక్ హిట్ ఇచ్చాడు. ఫ్యాన్స్ కి ఆనందాన్ని పంచాడు.
ఈ ఫస్ట్ రివ్యూ ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమేర్ సంధూ అభిప్రాయం.. ఆలోచన మేరకు రాయబడింది. ఫిల్మీ ఫోకస్ రివ్యూ మరికొన్ని గంటల్లో పబ్లిష్ కానుంది. ఆ రివ్యూ ని, రేటింగ్ ని మిస్ కాకండి.