ప్రీమియర్ షో తోనే రికార్డ్ సృష్టించనున్న అజ్ఞాతవాసి
January 9, 2018 / 06:41 AM IST
|Follow Us
డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన మూడవ సినిమా అజ్ఞాతవాసి పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే లేకుండా అమెరికాలోను విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ఇది వరకు ఏ తెలుగు సినిమా ప్రదర్శితం కానీ స్క్రీన్స్ లలో అజ్ఞాతవాసి రిలీజ్ అవుతోంది. అమెరికాలో బాహుబలి 2 అన్ని భాషలు కలుపుకొని 462 స్క్రీన్స్ లో రిలీజ్ అయితే.. అజ్ఞాతవాసి మాత్రం 570 స్క్రీన్స్ లో విడుదలవుతోంది. అయినప్పటికీ బుకింగ్స్ మొదలు పెట్టిన వెంటనే టికెట్స్ అయిపోవడం విశేషం. అమెరికాకి చెందిన ఒక టికెట్ బుకింగ్ సైట్ లో ఒక రోజులో బుక్ చేసుకున్న టికెట్స్ లెక్కప్రకారం .. 26.4 శాతం అజ్ఞాతవాసి టికెట్స్ అమ్ముడు పోగా ఆ తర్వాత జ్యూమాంజి నిలిచింది. 12.1 శాతం టికెట్స్ ఈ సినిమా కోసం కొన్నారు. స్టార్ వార్స్ (8.7%), ఇంసిడియోస్ (8.3%), ది గ్రేటెస్ట్ షో మాన్(8.2%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దీన్ని బట్టి పవన్ సినిమా క్రేజ్ ఎంత ఉందో అర్ధం అవుతోంది.
మరి కొన్ని గంటల్లో అమెరికాలో అజ్ఞాతవాసి ప్రీమియర్ షో వేయనున్నారు. ఈ షోల ద్వారానే ఒక మిలియన్ డాలర్ కలక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలవారు అంచనా వేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా… ఖుష్బూ, బొమన్ ఇరానీ, ఆది పినిశెట్టి, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ తో సందడి చేయనున్న ఈ చిత్రం రేపు మనదేశంలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.