‘డాన్స్ ఐకాన్’ అనే సరికొత్త షో తో వస్తున్నారు ఆహా మరియు ఓక్ ఎంటర్టైన్మెంట్!

  • June 22, 2022 / 11:05 PM IST

22 జూన్ నుండి ప్రారంభం కానున్న ఆడిషన్స్ – నెమలికి నేర్పిన నడకలివి అని ఆనాడు పాడిన, రా రా రమంటున్న రణరంగంలో సిద్దంగున్నా చావో రేవో తేలాలిపుడే డాన్స్ అని ఈ మధ్య పాడినా, డాన్స్ అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికీ వారిలో ఉన్న ఒక డ్యాన్సర్ బయటికొస్తారు. మరి మీలో ఎవరైనా అలాంటి డ్యాన్సర్ ఉంటే, ఆ ప్రతిభ మీకుంటే ఆహా, ఓక్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి సమర్పిస్తున్న ‘డాన్స్ ఐకాన్’ అనే షో మీ కోసమే. మీ ప్రతిభకు మా వేదిక శిరస్సు వంచి ఆహ్వానిస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, ఆడిషన్స్ ఇచ్చేయండి, డాన్స్ ఐకాన్ టైటిల్ ను గెలుచుకోండి.

జూన్ 22 నుండి ప్రారంభం కానున్న ఈ షో యొక్క డిజిటల్ ఆడిషన్స్ జులై 10 వరకు కొనసాగుతాయి. మీ వయస్సు 5 నుండి 50 మధ్యలో ఉన్నట్టయితే, మీరు తెలుగు రాష్ట్రాలకి చెందిన వారైతే, మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. danceikon@oakentertainments.com అనే ఈమెయిల్ కు, 60 సెకండ్స్ మీ డాన్స్ వీడియోని మెయిల్ చేయండి.

ఈ షో యాంకర్ మరియు ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ, ” ఈ షో ద్వారా నేను ఓటిటి ప్లాట్ఫామ్ లోకి అడుగుపెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ఆహా కు ధన్యవాదములు. నేను ఎన్నో డాన్స్ షోస్ చేశాను, కానీ ఇది చాల డిఫరెంట్ గా ఉండబోతుంది. ఈ షో కంటెస్టెంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్స్ జీవితాల్ని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్ యొక్క కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో కి డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. అది ఎవరు అని మేము ఫినాలే లో చెప్తాము. అందుకే ఈ షో మీ కోసమే. మీరు డాన్స్ చేయగలరు అనుకుంటే తప్పకుండా ఈ షోలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను.”

ఇంకా ఎందుకు ఆలస్యం, మీ డాన్స్ షూస్ వేసుకొని నచ్చిన పాటకి డాన్స్ చేసి – డాన్స్ ఐకాన్ అనిపించుకోండి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus