మీమ్స్‌ యుద్ధం కొనసాగిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌

  • January 26, 2021 / 11:34 AM IST

సినిమాల విషయంలో చిత్ర నిర్మాణ సంస్థలు పోటాపోటీ ట్వీట్లు పెట్టడం ఎప్పుడైనా చూశారా? మహా అయితే మా సినిమా ఇప్పుడు, ఫస్ట్‌ లుక్‌ అప్పుడు, మీకో అప్‌ డేట్‌ రెడీగా ఉంది అంటూ ట్వీట్లు చేస్తుంటారు. అభిమానులు మాత్రం రెండు సినిమాలను, నిర్మాణ సంస్థలను, దర్శకులను పోల్చుకుంటూ ట్వీట్లు చేస్తుంటారు. మీమ్స్‌ పెడుతుంటారు. అయితే ఓటీటీల యుగంలో పరిస్థితులు మారాయి. ఏకంగా ఆయా ఓటీటీల సోషల్‌ మీడియా ఛానల్స్‌ విమర్శల పర్వానికి దిగుతున్నాయి.

ఓటీటీల మాటల యుద్ధం కొత్తదైతే కాదు. గతంలో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ మధ్యలో కూడా జరిగింది. అయితే తెలుగులో ఓటీటీల మాటల యుద్దాన్ని పరిశీలిస్తే… స్టార్ట్‌ చేసి ‘ఆహా’నే. ‘ఒరిజినల్స్‌’తో తెలుగులో అడుగుపెడుతున్నాం… అంటూ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ ఓ ట్వీట్‌ చేసింది. దానికి ప్రతి స్పందనగా ‘మా దగ్గర ఎన్నో ఒరిజినల్స్‌ ఉన్నాయి… అరుస్తున్నామా?’ అని ట్వీట్‌ చేసింది. దానికి అప్పటికప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ పెద్దగా స్పందించలేదు. అయితే నెటిజన్లు, ఓటీటియన్స్‌ మాత్రం ట్రోలింగ్‌ షురూ చేశారు. ‘మీ దగ్గర ఉన్నవి డబ్బింగ్‌లే’ కదా అంటూ తెగిడారు.

తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ఓ ట్వీట్‌ చేసింది. అందులో ఓ వ్యక్తిని మరో వ్యక్తి తిడుతున్నట్లు ఉంది. ‘వీడు వీడి యేషాలు… గొడవలు ఎందుకు, బాధ్యత ఉండక్కర్లే’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఇదంతా ‘ఆహా’ గురించే అంటూ నెటిజన్లు అనుకుంటున్నారు. ‘ఆహా’ అన్నాక… ‘నెట్‌ఫ్లిక్స్‌’ ఎందుకు ఊరుకుంటుందని అందరూ అంటున్నారు. అయితే నెట్‌ప్లిక్స్‌ ఎక్కడా ‘ఆహా’ పేరెత్తలేదు. ‘ఆహా’ ఎక్కడా ‘నెట్‌ఫ్లిక్స్‌’ పేరు ఎత్తలేదు. అయినా ఇలాంటి ప్రచారాలు ఎందుకు అరవిందా?

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus