అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ మధ్య విభేదాలు

  • October 6, 2016 / 06:56 AM IST

మొన్న అమల పాల్.. నిన్న సౌందర్య రజనీకాంత్.. నేడు ఐశ్వర్యా రాయ్.. వార్తల్లో ప్రధానంగా నిలుస్తున్నారు. కారణం కుటుంబ కలహాలు. ఆలు మగల మధ్య విభేదాలు. అమల పాల్ తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య తన భర్త అశ్విన్ కి కొంతకాలంగా దూరంగా జీవిస్తోంది. ప్రస్తుతం మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ కి పడడం లేదని తెలిసింది. ముంబై మీడియా అయితే ఏకంగా వీరిద్దరూ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని కథనాలను ప్రచురిస్తున్నాయి.

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకు సంసారాన్ని చక్క దిద్దడానికి చాలా ప్రయత్నిస్తున్నారని, అయినా అభిషేక్, ఐశ్వర్య మాట్లాడుకోవడం లేదని సమాచారం. ఐశ్వర్యరాయ్ తాజా గా నటించిన ”ఏ దిల్ హై ముష్కిల్ ” చిత్రం ట్రైలర్ యూట్యూబ్లో సంచలనం రేపుతోంది. ఇందులో ఐష్ రణబీర్ కపూర్ తో చేసిన రొమాంటిక్ సీన్లు మతి పోగొడుతున్నాయి. ఈ ట్రైలర్ ను చూసిన జయా బచ్చన్  మండిపోతుందంట. అందుకే ఆమె కొడుకు అభిషేక్ బచ్చన్ కి సపోర్ట్ గా ఉండి విడాకులకు మద్దతు ఇస్తుందని తెలిసింది. మరి ఐశ్వర్య తన సంసారాన్ని ఎలా చక్క బెట్టుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus