2.o లో ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఐశ్వర్య రాయ్

  • October 1, 2018 / 09:44 AM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమర్షియల్ డైరక్టర్ శంకర్ కలయికలో వచ్చిన రోబో సంచలన విజయం సాధించింది. మళ్లీ అదే కాంబినేషన్లో తెరకెక్కిన మరో కళాఖండం 2 .o. అయితే రోబోలో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటిస్తే.. ఇందులో ఎమీజాక్సన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్నఈ మూవీ టీజర్ ప్రకంపనలు సృష్టించింది. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఎంతోమంది ఎదురుచూస్తున్న సినిమా గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాలో అందాల తార ఐశ్వర్యరాయ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. చిన్న సీన్ అయినప్పటికీ ఐశ్వర్యరాయ్ అందరితో చప్పట్లు అందుకుంటుందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఐశ్వర్యరాయ్ అభిమానులకు ఈ న్యూస్ ఎంతో సంతోషాన్ని కలిగించింది. రోబోలో ఐశ్వర్య నటన, డ్యాన్స్.. అందాలతో ఆకట్టుకుంది. ఇందులోనూ ఆమె మంచి విందు ఇవ్వడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus