Aishwarya Rajesh: ‘సరైన పని చేశారు’ అంటూ ఆటో డ్రైవర్ పై మండిపడ్డ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్!

  • September 29, 2022 / 06:51 PM IST

సీనియర్‌ స్టార్ కమెడియన్ శ్రీ లక్ష్మి మేనకోడలుగా టాలీవుడ్లో పాపులర్ అయ్యింది ఐశ్వర్య రాజేష్. ఈమె తెలుగమ్మాయే అయినప్పటికీ మొదట తమిళ్ లో ఫేమస్ అయ్యింది. ఆమె తండ్రి కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. అయితే ఆయన చిన్నతనంలోనే అనారోగ్య సమస్యలతో మరణించడంతో కుటుంబ భారమంతా ఐశ్వర్య రాజేష్ పై పడింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఐశ్వర్య రాజేష్ తన సొంత టాలెంట్ తోనే పైకొచ్చింది.

ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఐశ్వర్య రాజేష్ మరోపక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఇటీవల చెన్నైలో చోటుచేసుకున్న ఊబర్‌ ఆటో డ్రైవర్‌ ఘటనపై ఐశ్వర్య రాజేష్ స్పందించింది.ఇషితా సింగ్‌ అనే యువతి చెన్నైలో ఉన్న ఏసీజే ఇండియా కాలేజ్‌లో జర్నలిజం కోర్సు చదువుతోంది. ఈ మధ్యనే ఆమె ఈస్ట్‌ కోస్ట్‌ మద్రాస్‌ నుంచి ఐబిస్‌ ఓఎమ్‌ఆర్‌ హోటల్‌కు రావటానికి తన స్నేహితురాలితో కలిసి ఊబర్‌ ఆటో ఎక్కింది.

ఆటో ఐబిస్‌ ఓఎమ్‌ఆర్‌ హోటల్‌ దగ్గరకు రాగానే ఇషిత స్నేహితురాలు డబ్బులు చెల్లించటానికి కిందకు దిగింది. ఆమె వెనకాలే ఇషితా కూడా దిగడానికి రెడీ అయ్యింది. అయితే ఆ ఆటో డ్రైవర్‌ ఇషితాతో తప్పుగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేట్ పార్ట్ ను తాకాడు. దీంతో బాధితురాలు ఆటో డ్రైవర్‌పై విరుచుకుపడింది. అతడ్ని పోలీసులకు అప్పగించాలని ప్రయత్నించింది. అయితే, ఆ ఆటో డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు.

ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా. పోలీసులు అరగంట తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే కంప్లైంట్ తీసుకుని మంగళవారం అతడ్ని అరెస్ట్‌ చేశారు. సదరు ఆటో డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పై ఐశ్వర్య రాజేష్ స్పందించింది .. ‘‘అలాంటి వెధవలను ఊరికే వదలకూడదు, కఠినంగా శిక్షించాలి. అతనిపై చర్యలు తీసుకున్న పోలీసులకు నా కృతజ్ఞతలు . ఇషితా సింగ్‌ నువ్వు ధైర్యంగా ఉండు’’ అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus