మరోసారి అందరికీ షాక్‌ ఇచ్చిన అజిత్‌

  • March 22, 2021 / 04:21 PM IST

పేరుకే స్టార్‌ హీరో… అస్సలు అలాంటి దర్పం చూపించడు అంటుంటారు. ఎవరి గురించో తెలుసుగా.. మన అజిత్‌ గురించి. ఎన్ని హిట్లు వచ్చినా, ఫ్లాప్‌లు వచ్చినా… తన నైజం అస్సలు మారదు. సెట్‌లో సినిమా మిత్రుల కోసం వంట వండటం, హీరోయిన్లను అందంగా ఫొటోలు తీయడం, ఇంకా ఖాళీ ఉంటే… బైకో, కారో వేసుకొని లాంగ్‌ డ్రైవ్‌లు వెళ్లడం లాంటివి చేస్తుంటాడు. వీటితోపాటు అప్పుడప్పుడు పీపుల్‌ ట్రాన్స్‌పోర్టులో జర్నీ చేస్తుంటాడు. తాజాగా మరోసారి అలా ఆటోలో ప్రయాణించి ఆశ్చర్యపరిచాడు అజిత్‌.

దక్షిణాదిలో అజిత్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత క్రేజ్‌, ఫేమ్‌ ఉన్నా.. సింప్లిసిటీతో మరింత మెప్పిస్తుంటాడు. రోడ్లు మీద సైకిల్‌పై తిరిగుగుతుంటాడు… రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు. అవన్నీ చూసి వావ్‌ అనుకున్న అందరూ ఇప్పుడు మరోసారి వావ్‌ అంటున్నారు. కారణం రీసెంట్‌గా అజిత్‌ ఓ ఆటోలో ప్రయాణిస్తూ కనిపించాడు. గతంలోనూ అజిత్‌ ఇలా ఆటోలో ప్రయాణించాడని వార్తలొచ్చాయి. అయితే ఇప్పటి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అజిత్‌ ఆటోలో కనిపించేసరికి… కొంతమంది అభిమానులు వీడియోలు తీశారు. ఇప్పుడు ఆ వీడియోలే వైరల్‌ అవుతున్నాయి. అయితే అసలు అజిత్‌ కారు తీయకుండా, ఆటోలో బయటకు ఎందుకు వచ్చారు అనేది సరిగ్గా తెలియడం లేదు. ఇదంతా పక్కనపెడితే.. అజిత్‌ సింప్లిసిటీకి మాత్రం నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అభిమానులు ఎప్పుడూ ఫిదా అనుకోండి. ఇలా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో బయట తిరిగే సినిమా వాళ్లు చాలా తక్కువ. హిందీలో అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటారు.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus