కోలీవుడ్ హీరో.. బైక్ పై ఒక్కడే లాంగ్ ట్రిప్

  • January 19, 2021 / 11:04 AM IST

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు. వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా రోజులే అవుతోంది. దీంతి ఆభిమానులు అజిత్ ఫొటో కనిపిస్తే చాలు.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండ్ చేసేస్తున్నారు. ఇటీవల అజిత్ ఒక రికార్డ్ అందుకోవడానికి టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అజిత్ కు బైకులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొత్త బైక్ కనిపిస్తే చాలు వెంటనే దానీతో లాంగ్ ట్రిప్ వేయాలని అనుకుంటాడు.

మార్కెట్ లోకి కొత్త తరహా బైక్ లు వస్తున్నాయి అంటే ముందే బుక్ చేసేసుకుంటాడు. అయితే ఇటీవల అజిత్ వారణాసికి ఒక్కడే తన బీఎండబ్ల్యూ బైక్ పై వెళ్ళాడు. అక్కడి నుంచి సిక్కిం వెళ్ళడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల వారణాసిలో ఒక అభిమాణితో ఫొటో కూడా దిగాడు. అజిత్ దాదాపు 4000కిలో మీటర్ల ప్రయాణంతో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అజిత్ మళ్ళీ చెన్నైకు బైక్ పైనే వెళ్లనున్నట్లు సమాచారం.

గతంలో ఒకసారి షూటింగ్ కోసం తీసుకున్న ఖరీదైన బైక్ పై మనసు పారేసుకున్న అజిత్ హైదరాబాద్ నుంచి బైక్ పైనే చెన్నై వెళ్లిపోయాడు. ఆ రేంజ్ లో బైక్ లను ఇష్టపడతాడట. ఇక ప్రస్తుతం అజిత్.. వినొథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus