ఫ్లాష్ బ్యాక్ : నటి హీరాతో అజిత్ ప్రేమాయణం!

  • November 20, 2020 / 06:02 PM IST

దక్షిణాదిన అగ్ర హీరోల్లో ఒకరిగా చెలామణి అవుతున్నారు అజిత్. కోలీవుడ్ లో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగులో కూడా అజిత్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఈ హీరో పలు చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా ఈ హీరోకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1990లలో అజిత్ వరుస సినిమాలు చేస్తూ.. హిట్లు అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉండేవారు.

అదే సమయంలో అజిత్.. నటి హీరాకు ప్రేమలేఖలు రాసేవారట. వీటిలో ఒక లేఖను సీనియర్ నటుడు బాయిల్వాన్‌ రంగనాథన్‌ చదవడంతో విషయం బయటకొచ్చింది. ఓ సందర్భంగా ఆయన అజిత్, హీరాల ప్రేమ గురించి మాట్లాడారు. ‘కాథల్ కొట్టై’ అనే సినిమాలో మొదటిసారి అజిత్, హీరా కలిసి నటించారు. షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ‘తోడారమ్’ అనే మరో సినిమా కోసం ఇద్దరూ కలిసి పని చేశారు. అయితే వీరిప్రేమ ఎక్కువకాలం సాగలేదు.

వీరి పెళ్లికి హీరా తల్లి అంగీకరించలేదని.. యంగేజ్ లోనే తన కూతురు కెరీర్ కి ఫుల్ స్టాప్ పడకూడదని ఆమె పెళ్లికి నో చెప్పిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా సరైన కారణం తెలియదు. వారి ప్రేమకి ఎండ్ కార్డ్ పడడంతో అజిత్ కొన్నాళ్లకు షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి అనోష్కా, ఆద్విక్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నటిగా బిజీగా ఉన్న సమయంలోనే షాలిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి కుటుంబంతోనే కాలం గడుపుతోంది.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus