Ajith: స్టార్ హీరోని భయపెట్టిన ఫోన్ కాల్!

  • June 1, 2021 / 01:35 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంట్లో బాంబు పెట్టినట్లుగా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు ఫోన్ చేశారు. దీంతో స్థానిక పోలీసులు వెంటె అజిత్ ఇంటికెళ్లి తనిఖీలు చేశారు. హీరో అజిత్ భార్యాపిల్లలతో తిరువాన్మియూరులో నివాసముంటున్నారు. ఈయన ఇంట్లో బాంబు పెట్టినట్లుగా పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అజిత్ ఇల్లు మొత్తం తనిఖీ చేయగా.. ఎలాంటి బాంబు దొరకలేదు. కావాలనే ఫేక్ కాల్ చేసి బెదిరించినట్లుగా తెలుస్తోంది.

అజిత్ ఇంటికి ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇది మొదటిసారి కాదు. 2014లో కూడా ఇలాంటి ఫోన్ కాల్ వస్తే అజిత్ స్టాఫ్ లో ఒకరు పోలీసులకు సమాచారమిచ్చారు. అదొక ఫేక్ కాల్ అని తేలిన తరువాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత 2017లో మళ్లీ ఇలానే అజిత్ ఇంట్లో బాంబు పెట్టామని ఆకతాయిలు ఫోన్ చేశారు. అప్పుడైతే ఏకంగా పదిహేను మంది పోలీసులు అజిత్ ఇంటికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు.

సెలబ్రిటీలను బెదిరిస్తూ ఇలాంటి ఫోన్లు చేయడం ఆకతాయిలు సరదా అయిపోయింది. ఈ లాక్ డౌన్ లో అయితే రజినీకాంత్, విజయ్ లాంటి స్టార్ల ఇంటికి కూడా ఇలాంటి ఫేక్ కాల్స్ చాలానే వచ్చాయి. ప్రస్తుతం అజిత్ ‘వాలిమై’ అనే సినిమాలో నటిస్తున్నారు. వినోద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus