Ajith: ‘తునివు’ సినిమాకి క్రేజీ ఛాన్స్!

  • December 8, 2022 / 03:42 PM IST

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు విజయ్ ‘వారసుడు’ కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించడంతో ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెజారిటీ థియేటర్లు ఈ మూడు సినిమాలు పంచుకుంటే.. మరో అనువాద సినిమా ‘తునివు’ నామమాత్రంగా రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు.

‘తునివు’ సినిమాను తెలుగులో ‘తెగింపు’ పేరుతో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మిగతా మూడు సంక్రాంతి సినిమాలకు లేని అడ్వాంటేజ్ అజిత్ సినిమాకి దక్కుతుండడం విశేషం. సంక్రాంతికి పోటీయే లేకుండా సోలోగా ఒక్క రోజంతా బ్యాటింగ్ చేయబోతున్న సినిమా ‘తునివు’ మాత్రమే. ఈ సినిమా జనవరి 11, బుధవారం రిలీజ్ కాబోతుంది. ఆ తరువాతి రోజు ‘వీరసింహారెడ్డి’, ‘వారసుడు’ విడుదలవుతాయి. 13న ‘వాల్తేర్ వీరయ్య’ రాబోతుంది.

సంక్రాంతికి భారీ పోటీ ఉండడంతో ముందు వారం ఎలాగో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కావు. థియేటర్లన్నీ ఖాళీగా ఉంటాయి. కాబట్టి 11ఆ రిలీజ్ అయ్యే ‘తునివు’ సినిమాను కావాల్సినన్ని థియేటర్లు, షోలు దక్కుతాయి. సినిమాకి టాక్ బాగుంటే వసూళ్లు బాగా వచ్చే ఛాన్స్ ఉంది. పైగా సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం మూడు కోట్లకే అమ్మేశారు. కాబట్టి మంచి ట్రైలర్ వదిలి.. హైప్ తీసుకురాగలిగితే మొదటి రోజే రికవరీ మొత్తం వచ్చేస్తుంది. మరి ఇక్కడి నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి!

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus