బాలయ్య అభిమానులు అఖండ మూవీ రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావడం లేదు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదలవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నా ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో ఫ్యాన్స్ కు సైతం అర్థం కావడం లేదు. అఖండ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఎప్పుడు విడుదలైనా ఈ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు గ్యారంటీ అని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి నమ్మకముంది.
ఆంధ్రలో అఖండ హక్కులు ఏకంగా 35 కోట్ల రూపాయల రేషియోలో అమ్ముడయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బయ్యర్లు ఆ రేటు కిట్టుబాటు కాదని చెబుతున్నారు. కనీసం పాతిక శాతం తగ్గించాలని బయ్యర్లు నిర్మాతను కోరుతున్నారు. అయితే భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించడంతో నిర్మాత అందుకు అంగీకరించడం లేదని సమాచారం. ఆంధ్ర ఏరియా హక్కులను తగ్గిస్తే సీడెడ్ లో కూడా హక్కుల ధరలు తగ్గించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి మీటింగ్ లు, డిస్కషన్లు జరుగుతున్నాయని బోగట్టా.
మీటింగ్స్, డిస్కషన్స్ పూర్తైతే మాత్రమే రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన అఖండ పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. సర్జరీ జరగడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య త్వరలో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కే మూవీలో నటించనున్నారు. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే మూవీలో నటించనున్నారని తెలుస్తోంది.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!