అఖిల్, వెంకీ అట్లూరి సినిమాలో హీరోయిన్ ఫిక్స్

  • May 4, 2018 / 10:09 AM IST

హలో సినిమాతో విజయాన్ని అందుకున్న అఖిల్.. ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. తొలి ప్రేమ అందించిన విజయ ఉత్సాహంతో వెంకీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అని సమాచారం. సో అఖిల్ వెంటపడే అమ్మాయి కోసం కొన్నిరోజులుగా వెంకీ అట్లూరి వెతికారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ ని ఫిక్స్ చేసినట్లు తెలిసింది. మున్నా మైఖేల్ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ భామ..

తెలుగులో నాగచైతన్యకి జోడీగా సవ్యసాచిలో నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈ అఫర్ ని పట్టేసింది. అన్నతో రొమాన్స్ చేసిన నిధి త్వరలోనే తమ్ముడితో ప్రేమాయణం సాగించనుంది. సాహో లో హీరోయిన్ గా ఛాన్స్ కోల్పోయిన ఈ నటి వరుసగా అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలతో నటించే అవకాశం రావడంతో ఆనందపడుతోంది. బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సారి పూర్తి స్థాయి ప్రేమకథతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని అక్కినేని ప్రిన్స్ అఖిల్ కష్టపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus