Akira Nandan: నో డౌట్ పవన్ కొడుకు అఖీరా ఎంట్రీ ఫిక్స్ అట.. ..!

  • April 9, 2022 / 05:35 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ తప్పకుండా సినిమాల్లోకి వస్తాడని,హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీని షేక్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అఖిరా నందన్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఏ మాత్రం బయటకు వచ్చినా కూడా వాటిని ఓ రేంజ్లో వైరల్ చేస్తున్నారు. అఖిరా వయస్సు 18 ఏళ్ళు దాటింది.అఖీరా అడల్ట్ అయ్యాడని అతని తల్లి, పవన్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ ఓ సందర్భంలో చెప్పింది.

అఖీరా తన చెల్లికి మంచి సోదరుడు, స్నేహితులకు మంచి మిత్రుడు, మొత్తంగా అతను ఓ పర్ఫెక్ట్ జెంటిల్ మెన్ అని చెప్పుకొచ్చింది.అయితే అతనికి యాక్టర్ అవ్వాలని లేదని, ఇంతవరకు ఎలాంటి సినిమా చేసేందుకు సైన్ చేయలేదని చెప్పి అభిమానులకి షాకిచ్చింది రేణు దేశాయ్. మొన్నటికి మొన్న అఖిరా బాక్సింగ్ చేస్తూ పవర్ ఫుల్ పంచెస్ ఇస్తున్న ఓ వీడియో రిలీజ్ అయ్యింది. అఖిరా చూడ్డానికి చాలా బాగున్నాడని అతను హీరో అయితే స్టార్ గా ఎదుగుతాడని అభిమానులు కామెంట్లు పెట్టారు.

ఇంతలో రేణు అలా అనేసరికి వాళ్ళు నిరాశ చెందారు. అయితే రేణు ఈ విషయంలో అబద్దం చెబుతుంది లేదా నిజం దాస్తోంది అనేది ఇన్సైడ్ టాక్. ‘హరి హర వీర మల్లు’ సినిమాలో అఖీరా నటిస్తున్నాడట. యంగ్ పవన్ కళ్యాణ్ పాత్రలో అతను కనిపించబోతున్నాడట. ఇందుకు సంబంధించి అఖీరా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఎక్కువ శాతం తన తండ్రి పవన్ కళ్యాణ్ వద్దే ట్రైనింగ్ తీసుకున్నాడని వినికిడి. ఇతని పాత్రని దర్శకుడు క్రిష్ చాలా బాగా డిజైన్ చేసాడట.

తండ్రికి చిన్ననాటి పాత్రల్ని పోషించడం ఇండస్ట్రీలో కొత్తేమి కాదు. ‘1 నేనొక్కడినే’ సినిమాలో మహేష్ చిన్నప్పటి పాత్రని గౌతమ్ పోషించాడు, ‘రాజా ది గ్రేట్’ లో కూడా రవితేజ చిన్నప్పటి పాత్రని అతని కొడుకు మహదాన్ పోషించాడు. ఇప్పుడు పవన్ చిన్నప్పటి పాత్రని అఖీరా పోషించనున్నారు. ఈ మూవీలో పవన్ ఓ గజదొంగ గా కనిపించబోతున్నాడట.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus