Prabhas: ప్రభాస్ మూవీలో మరో హీరోయిన్ ఈమేనా?

  • July 27, 2021 / 10:31 PM IST

ఏ మాయ చేశావె సినిమాతో తొలి సినిమాతోనే సక్సెస్ సాధించిన సమంత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఇన్నేళ్ల సినీ కెరీర్ లో సమంత తెలుగులో అందరు స్టార్ హీరోలతో కలిసి నటించినా ప్రభాస్ తో మాత్రం సమంత కలిసి నటించలేదు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కె సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తున్నారు.

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సమంత నటిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ కాంబోలో మూవీ తెరకెక్కితే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో సమంతకు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు రావడంతో ప్రాజెక్ట్ కె సినిమాలో సమంత నటిస్తే సమంత కెరీర్ కు కూడా ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

నాగ్ అశ్విన్ గత సినిమా మహానటిలో కూడా సమంత నటించిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తున్న సమంత మంచి పాత్రలు అయితే మాత్రమే ఇతర హీరోల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సమంత ప్రభాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ కె సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus