మంచి హిట్ అందుకోవాలని శ్రమిస్తున్న అఖిల్.!

  • March 24, 2018 / 11:56 AM IST

ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్ లేని వాళ్లు.. వరుసగా విజయాలు అందుకుంటున్నారు. చిన్న చిన్న కథలతో బిగ్ హిట్ సొంతం చేసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా అనుభవం ఉన్న కుటుంబం అక్కినేని ఫ్యామిలీ. అందులో మూడో తరం హీరోగా వచ్చిన అఖిల్ (Akkineni Akhil) కి ఇప్పటి వరకు మంచి హిట్ లేదు. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో చేసిన అఖిల్ మూవీ నిరాశ పరిచింది. అలాగే విక్రమ్ కూమార్ తో చేసిన భారీ యాక్షన్ లవ్ స్టోరీ మూవీ హలో పరవాలేధనిపించింది. ఇప్పుడు సూపర్ హిట్ కోసం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించడానికి అఖిల్ ఫిక్స్ అయ్యారు. కాస్త ఆలస్యంగానైనా తొలిప్రేమ వంటి లవ్ స్టోరీ తెరకెక్కించిన డైరక్టర్ ని ఎన్నుకొని మంచి పనిచేశారు.

అలాగే కొత్త ట్యూన్స్ తో టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న ఎస్.ఎస్. థమన్ ని తన సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. అంతటితో ఆగిపోలేదు. థమన్, వెంకీతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్ మొదలెట్టారు. ఈ సినిమా వీనుల విందు మాత్రమే కాదు కనుల విందుగా ఉండాలని లొకేషన్ సెట్ జేసే పని మొదలెట్టారు. నిన్ననే అఖిల్, డైరక్టర్ తో కలిసి థాయ్ ల్యాండ్ కి వెళ్లారు. అక్కడ మంచి లొకేషన్స్ వెతికే పనిలో పడ్డారు. బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ మే నుంచి సెట్స్ మీదకు వెళుతుంది. ఈ చిత్రంతో తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతానని అఖిల్ పూర్తి నమ్మకంతో ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus