‘కబాలి’ ఫస్ట్ షో వీక్షించనున్న అక్షయ్..!

  • May 14, 2016 / 09:57 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కబాలి’. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చెన్నై లో వీక్షించారు. ఈ ట్రైలర్ ఆయన్ను ఎంతో ఆకట్టుకోవడంతో ఫస్ట్ డే ఫస్ట్ షోలో ఈ చిత్రాన్ని వీక్షించాలని ఆయన తెలిపినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

పా రంజిత్ దర్శకత్వంలో కలై పులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ నాట ఎన్నికల కారణంగా జూలై 1న విడుదల అవుతోంది. కాగా శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ గా తెరకెక్కుతున్న రోబో ‘2.0’ చిత్రంలో అక్షయ్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus