ప్రముఖ కమెడియన్ అలీ ఎఫ్3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బుల్లితెరపై తాను ఒక షోకు హోస్ట్ గా చేస్తున్నానని ఎస్వీ కృష్ణారెడ్డిపై ఉన్న అభిమానంతో యమలీల సీరియల్ చేశానని అలీ తెలిపారు. ఎస్వీ కృష్ణారెడ్డి నన్ను హీరోను చేశారని అందుకే తాను సీరియల్ లో యాక్ట్ చేశానని అలీ వెల్లడించారు. కథ విని పాత్ర నచ్చితే మాత్రమే సినిమాలు చేస్తున్నానని అలీ తెలిపారు.
ఎఫ్3 సినిమాలో పాత అలీని కచ్చితంగా చూస్తారని నా పాత్రలో అంత సత్తా ఉందని ఆయన అన్నారు. నా పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఎఫ్3లో తన పాత్ర పేరు పాల బేబీ అని వడ్డీకి తిప్పే పాత్ర నాదని సినిమాలో 45 నిమిషాల పాటు నా పాత్ర ఉంటుందని ఆయన అన్నారు. సినిమాలో ప్రతి పాత్ర కీలకమని ఒకరిని మించి మరొకరు నటించారని అలీ కామెంట్లు చేశారు.
వెంకటేష్, వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోనే పుట్టారని మిగతా నటీనటులు కూడా మూవీలో చక్కగా నటించారని అలీ అన్నారు. దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ దొరకడం అనిల్ లక్ అని అలీ కామెంట్లు చేశారు. కామెడీ సినిమాలు చేయడంలో చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఎక్స్ పర్ట్స్ అని అలీ చెప్పుకొచ్చారు. సీఎం జగన్ తనను పొలిటికల్ లీడర్ గా క్రియేట్ చేయబోతున్నారని అలీ అన్నారు.
సీఎం జగన్ నుంచి కాల్ వస్తే మీడియా సమక్షంలో ఆ విషయాన్ని పంచుకుంటానని అలీ వెల్లడించారు. ఎఫ్3 అద్భుతమైన మూవీ అని 100 రూపాయల టికెట్ కు 300 రూపాయల ఆనందం అందిస్తుందని అలీ పేర్కొన్నారు. ఒక తమిళ వెబ్ సిరీస్ తో పాటు లైగర్, ఖుషీ, ఒకే ఒక జీవితం, అంటే సుందరానికి సినిమాలలో తాను నటిస్తున్నానని అలీ వెల్లడించారు. ఇప్పుడు నార్త్ వాళ్లే సినిమా ఆఫర్ల కోసం మన దగ్గరకు వస్తున్నారని అలీ అన్నారు. సౌత్ వాళ్లు తొక్కేస్తున్నారనే భయం వాళ్లకు మొదలైందని అలీ చెప్పుకొచ్చారు.