దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఎగిరి గంతేసి ఓకే చెప్పెయ్యడానికి అటు టాలీవుడ్లోనూ ఇటు బాలీవుడ్లోనూ చాలా మంది హీరోయిన్లు రెడీ గా ఉన్నారంట. అయితే ఓకే హీరోయిన్ మాత్రం ఈ క్రేజీ ఆఫర్ ని తిప్పికొట్టిందట. అసలు ఈ ఆఫర్ ను వదులుకున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు… బాలీవుడ్ నటి అలియా భట్. ప్రస్తుతం ‘ఆర్.ఎఫ్.సి’ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే కోల్ కతా కి షిఫ్ట్ అవ్వబోతుందని సమాచారం.
ఇక ఎన్టీఆర్- రాంచరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ లో చరణ్ కి జోడిగా మొదట అలియా భట్ ను తీసుకుపోవాలనుకున్నాడట జక్కన్న. అయితే బాలీవుడ్ లో తను వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండడంతో ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. ఒకవేళ పారితోషికం తక్కువగా భావించి ఆమె అలా చెప్పివుంటుందనుకుని, పారితోషికం పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నామని నిర్మాతలు ఆమెతో చెప్పారట. కేవలం పారితోషికం విషయమై ఆలోచించి ఇలా నో చెప్తున్నానని అనుకోవద్దనీ… నిజంగానే వరుస కమిట్మెంట్లు ఉండడటం వలెనే ఇలా చెప్పాల్సి వస్తుందని వారికి వివరణ ఇచ్చిందట. ‘ఎలాగూ రాజమౌళి సినిమా అంటే రెండు, మూడేళ్ళు పడుతుందని ఈ అమ్మడికి కూడా తెలిసిపోయినట్టుంది. అందుకే ఇలా తప్పించుకుంది’… అంటూ ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.